డీకే శివకుమార్‌ను అరెస్ట్‌ చేసిన ఈడీ

Tue,September 3, 2019 08:50 PM

DK Shivakumar arrested by  ED under Prevention of Money Laundering Act

బెంగళూరు: ఆదాయ పన్ను ఎగవేత, నగదు అక్రమ రవాణా ఆరోపణలపై కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత డీకే శివకుమార్‌పై గతేడాది సెప్టెంబర్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మనీల్యాండరింగ్‌ కేసులో శివకుమార్‌ను మంగళవారం రాత్రి ఈడీ అరెస్ట్‌ చేసింది. గత కొన్నిరోజులుగా శివకుమార్‌ను ఢిల్లీలో ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. శివకుమార్‌ భారీ మొత్తంలో అక్రమంగా నగదు తరలించినట్లు గతంలోనే ఐటీశాఖ గుర్తించింది.

ఈడీ అధికారుల విచారణ నిమిత్తం ఢిల్లీలో ఉన్న డీకేను కర్ణాటకకు చెందిన నేతలు ఆదివారం పరామర్శించారు. వినాయక చవితి పండుగ సందర్భంగా తనకు ఆరో తేదీ వరకు సెలవు ఇవ్వాలని శివకుమార్‌ చేసిన విన్నపాలను అధికారులు తోసిపుచ్చారు. సోమవారం ఉదయం నుంచి విచారణ కొనసాగించిన అధికారులు మంగళవారం అరెస్ట్‌ చేశారు.871
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles