ఆస్కార్‌కు అధికారిక ఎంట్రీగా గల్లీ బాయ్‌

Sat,September 21, 2019 06:28 PM

న్యూఢిల్లీ: బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ నటించిన గల్లీ భాయ్‌ చిత్రం 92వ ఆస్కార్‌ అవార్డ్స్‌కు భారత్‌ నుంచి అధికారిక ఎంట్రీగా ఎంపికైంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత ఫరాన్‌ అక్తర్‌ తన ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 9న ఆస్కార్‌ అవార్డుల వేడుక జరగనుంది. రణ్‌వీర్‌ సింగ్‌, అలియా భట్‌ ప్రధాన పాత్రలో జోయా అక్తర్‌ తెరకెక్కించిన చిత్రం గల్లీ భాయ్‌. ముంబై మురికివాడల్లో పెరిగిన ఓ యువకుడు ఇండియాలోనే టాప్‌ ర్యాపర్‌గా ఎదిగిన తీరును ఈ మూవీలో చూపించారు.

527
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles