భార్యను అతికిరాతకంగా చంపిన భర్త..

Mon,October 14, 2019 08:11 PM

రాజేంద్రనగర్‌: కలకాలం అల్లారుముద్దుగా చూసుకోవాల్సిన భార్యను ఓ భర్త అతికిరాతకంగా చంపాడు. వివరాల్లోకెళ్తే.. గండిపేట మండలం, నార్సింగి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని హైదర్ష్‌కోట్‌లో కాంతయ్య అనే వ్యక్తి తన భార్య శ్రీదేవిని రోకలిబండతో తలపై బలంగా బాదాడు. ఈ ఘటనలో ఆమె తీవ్ర రక్త స్రావంతో అక్కడికక్కడే మరణించింది. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. మృతదేహాన్ని పోస్టుమర్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కాగా, హంతకుడు కాంతయ్యను పోలీసులు అరెస్టు చేసి, విచారిస్తున్నారు.

4817
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles