బైక్‌ను ఢీకొన్న లారీ.. ఒకరు దుర్మరణం..

Sat,October 19, 2019 11:42 AM

రంగారెడ్డి: షాబాద్ మండల కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముందు వెళ్తున్న బైక్‌ను వేగంగా దూసుకొచ్చిన లారీ వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పైనున్న ఓ వ్యక్తి తల నుజ్జునుజ్జయి, దుర్మరణం చెందగా.. మరొక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలిని పరిశీలించారు. మృత దేహాన్ని పోస్టుమర్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తి పరిస్థితి కూడా విషమంగా ఉన్నదని డాక్టర్లు వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.


365
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles