ప్రేమజంట ఆత్మహత్యాయత్నం.. ప్రేమికుడు మృతి

Thu,October 17, 2019 12:17 PM

భద్రాద్రి కొత్తగూడెం: తమ పెళ్లికి పెద్దలు అంగీకంచరేమోనన్న భయంతో ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వివరాల్లోకెళ్తే.. పినపాక మండలం, ఏడూళ్లబయ్యారం గ్రామానికి చెందిన చిన్నిస్వామి(22), ఓ యువతి గత కొన్ని నెలలుగా ప్రేమించుకుంటున్నారు. తమ ప్రేమను పెద్దలు అర్థం చేసుకోలేదు. చాలా సార్లు వారిని ఇరు కుటుంబాలు వారించగా.. వారు తమ పెళ్లిని కూడా ఖచ్చితంగా అడ్డుకుంటారని భావించిన ఆ ప్రేమజంట పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. ఈ సంఘటన బుధవారం చోటుచేసుకుంది. విషయాన్ని గమనించిన స్థానికులు వారిని హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లగా.. యువకుడు చిన్నిస్వామి అప్పటికే మంరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. అమ్మాయి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.

925
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles