కుటుంబ సభ్యుల ముందే ప్రియుడి అసభ్య ప్రవర్తన

Wed,September 11, 2019 06:27 AM

Married women set herself on fire

దుండిగల్: కుటుంబ సభ్యుల ముందే ప్రియుడు.. తల్లి, కూతురు పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన గృహిణి ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. తీవ్రగాయాలతో ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ సంఘటన దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ వెంకటేశం కథనం ప్రకారం... దుండిగల్‌కు చెందిన జోగు భిక్షపతి, భాగ్య(35) దంపతులు. వీరికి కొడుకుతో పాటు కూతురు(15) ఉంది. ఇద్దరు స్థానికంగా ఉన్న పాఠశాలలో చదువుకుంటున్నారు. భిక్షపతి కూలీ పనులను చేస్తుంటాడు. కాగా..అదే గ్రామానికి చెందిన దార శ్రవణ్‌కుమార్(28).. భాగ్యతో వివాహేతర సంబంధం ఉంది. విషయం తెలిసిన భిక్షపతి మందలించగా... శ్రవణ్‌కుమార్ వారిపై బెదిరింపులకు పాల్పడ్డాడు. అలాగే భాగ్య కూతురు(15)పై కన్నేశాడు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం శ్రావణ్‌ కుమార్ భాగ్య ఇంట్లోకి వెళ్లి కుటుంబ సభ్యులు అందరూ చూస్తుండగా భాగ్యతో పాటు అమె కూతురు పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన భాగ్య ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. కుటుంబ సభ్యులు మంటలు ఆర్పి 108లో గాంధీ వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి మృతి చెందింది. మృతురాలి భర్త భిక్షపతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.

3039
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles