కమలానగర్ కాలనీలో భారీ చోరీ

Wed,September 18, 2019 08:35 PM

హైదరాబాద్: మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కమలానగర్ కాలనీలోని ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. బాధితుల వివరాల మేరకు.. మేము పని మీద ఇంటికి తాళం వేసి బయటికెళ్లాము. తిరిగొచ్చి చూసే సరికి ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయి. తాళం పగులగొట్టి ఉంది. లోపలికెళ్లి చూడగా.. బీరువా తాళం పగులగొట్టి వస్తువులు, బట్టలు చిందరవందరగా ఉన్నట్లు తెలిపారు. మొత్తం 25 తులాల బంగారు నగలు, 3.50 లక్షల రూపాయలు దోచుకెళ్లారని వారన్నారు.


ఈ ఘటనతో కంగుతిన్న వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. వీలైంనంత త్వరగా దొంగలను పట్టుకుంటామని వారు అన్నారు.

934
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles