ఫిర్యాదు పేరుతో వచ్చి..కానిస్టేబుల్ వేలినే కొరికేశాడు!

Wed,October 23, 2019 08:52 AM

ఖమ్మం క్రైం: ఖమ్మం నగర పాలక సంస్థ పరిధిలోని ఓ పోలీస్ స్టేషన్‌లో మంగళవారం రాత్రి ఓ సైకో వీరంగం చేసి కానిస్టేబుల్ చిటికిన వేలినే కొరికేశాడు. వన్‌టౌన్ పోలీసుల కథనం మేరకు సోమవారం అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో ఖమ్మం నగరంలోని జహీర్‌పురా తండాకు చెందిన బీ మస్తాన్ అనే వికలాంగుడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు ఇచ్చేందుకు వచ్చాడు. స్టేషన్‌లో రాత్రి వాచర్ డ్యూటీ నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ఎస్‌కే మన్సూర్ అలీ అతని పరిశీలించగా ఫుల్‌గా తాగి ఉండటంతో ఉదయం వచ్చి ఫిర్యాదు చేయాలని తెలిపాడు. మస్తాన్ మద్యం మత్తులో సైకోలా ప్రవర్తించాడు. వెంటనే కానిస్టేబుల్ అతని మందలించే సమయంలో చేతిని పట్టుకుని చిటికిన వేలును నోటితో కొరకడంతో అతని వేలు తెగిపడి పోయింది. వెంటనే అక్కడ డ్యూటీలో ఉన్న సిబ్బంది మన్సూర్ అలీని నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మస్తాన్ అక్కడి నుంచి పారిపోగా మంగళవారం వన్‌టౌన్ సీఐ బర్పటి రమేష్ అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

1109
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles