అక్కాతమ్ముళ్ల అనుమానాస్పద మృతి..

Sun,October 27, 2019 08:55 PM

హైదరాబాద్: నగరంలోని కంచన్‌బాగ్ హఫీజ్ బాబానగర్‌లో అర్ధరాత్రి ఇద్దరు అనుమానాస్పద రీతిలో మరణించారు. వారిద్దరూ అక్కాతమ్ముళ్లని స్థానికులు తెలిపారు. అక్క నేహా జబ్లిన్(14), తమ్ముడు రషీద్(12) గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, విచారణ చేపట్టారు. కాగా, అక్కాతమ్ముళ్ల మృతి స్థానికంగా కలంకలం రేపింది. చుట్టు పక్కల వారు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

866
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles