రైలు ఎక్కబోయి... కిందపడి వ్యక్తి మృతి

Thu,October 17, 2019 07:42 AM

హైదరాబాద్: కదులుతున్న రైలు ఎక్కబోయి.. ప్రమాదవశాత్తు జారి కిందపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. నాంపల్లి రైల్వే ఎస్సై దాస్యానాయక్ కథనం ప్రకారం.. బుధవారం నాంపల్లి నుంచి విజయవాడకు గోదావరి ఎక్స్‌ప్రెస్ బయలు దేరింది. అదే సమయంలో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి రైలు ఎక్కబోయి.. జారి రైలు కింద పడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతన్ని 108లో దవాఖానకు తరలిస్తుండగా దారిలోనే మృతి చెందాడు. చికిత్సకు తరలించే సమయంలో పోలీసులు అతన్ని వివరాలు అడుగగా.. తన పేరు మహేశ్ అనీ, ఉత్తరప్రదేశ్ కి చెందినవాడనని తెలిపాడు. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

1585
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles