అనుమానాస్పదంగా పులి మృతి

Sun,August 25, 2019 09:42 PM

Tiger Suspicious Death  in Telangana, Maharashtra Border |

సిర్పూర్(టి): తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దులో పెను గంగా నది అవతలి ఒడ్డున అనుమానస్పదంగా పులి మృతి చెందింది. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా పోడ్సా గ్రామ సమీపంలోని పత్తి చేనులో పులి మృతి చెందింది. పంట చేనులో ఆదివారం పులి కళేబరం కనిపించడంతో స్థానికులు మహారాష్ట్రలోని అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే మహారాష్ట్ర అటవీశాఖ ఉన్నాతాధికారులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. అనంతరం పులికి పంచానామ నిర్వహించారు. పులి చనిపోయి మూడు, నాలుగు రోజులు అవుతుందనీ, దాని వయస్సు రెండేళ్ల వరకు ఉంటుందన్నారు. పులి ఎక్కడి నుండి వచ్చిందనేదానిపై వివరాలు సేకరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. పులి అనారోగ్యంతో చనిపోయిందా లేకా.. ఇతర కారాణాలు ఏమైన ఉన్నాయా అనే కోణంలో మహారాష్ట్ర అటవీశాఖ అధికారులు విచారణ చేపడుతున్నారు. క్రిమిసంహారక మందు ప్రభావం వల్లనే మరణించి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు పోస్టుమార్టం నివేదిక అనంతరం తెలుస్తాయన్నారు. పులి చనిపోయిన విషయం తెలుసుకున్న సిర్పూర్(టి) రేంజ్ అటవీశాఖ డిప్యూటీ రేంజ్ అధికారులు ప్రతాప్‌నాయక్, ఎండీ ముసావీర్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. పులి ఎలా చనిపోయిందన్న విషయాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు.

1270
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles