భార్య ఆత్మహత్యకు కారణమైన భర్తకు రెండేళ్ల జైలు

Wed,October 23, 2019 09:07 AM

ఖమ్మం లీగల్: భర్త వేధింపుల కారణంగా భార్య ఆత్మహత్య చేసుకున్న కేసులో నునావత్ భద్రుకు రెండేళ్ల జైలు శిక్ష విధించారు. రఘునాథపాలెం మండలం పంగిడి గ్రామానికి చెందిన భద్రు భార్యను వేధించి ఆత్మహత్యకు కారణమైన కేసులో ఖమ్మం ఒకటవ అదనపు జిల్లా న్యాయమూర్తి వి.బాలభాస్కర్‌రావు కింద కోర్టులో విధించిన రెండు సంవత్సరాల జైలు శిక్షను ఖరారు చేస్తూ మంగళవారం తీర్పు చెప్పారు. కేసు వివరాల ప్రకారం రఘునాథపాలెం మండలం పంగిడి గ్రామానికి చెందిన సుశీలతో, అదే గ్రామానికి చెందిన నునావత్ భద్రుకు పెళ్లి జరిగింది. నిందితుడు భద్రు కొద్దికాలము భార్యతో మంచిగానే కాపురం చేశాడు. ఆ తరువాత భద్రు మద్యానికి బానిసై భార్యను వేధిస్తూ తరచు గొడవ పడేవాడు.పెద్ద మనుషుల పంచాయితీతో కూడా అతనిలో మార్పు రాలేదు.


2013, జూలై 6న తెల్లవారుజామున సుశీల పురుగుల మందు తాగడంతో భద్రు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చాడు. సుశీల చికిత్స పొందుతూ మరణించింది. భర్త వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుందనే ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడు భద్రుపై కోర్టులో చార్జీషీట్ దాఖలు చేశారు. ఇరుపక్షాల వాదనలు కేసు పూర్వపరాలను పరిశీలించిన న్యాయ మూర్తి కింది కోర్టు తీర్పును ధృవీకరిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరుఫున అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొండపల్లి జగన్‌మోహన్‌రావు వాదించగా, వారికి లైజన్ ఆఫీసర్ పి.భాస్కర్‌రావు, కోర్టు కానిస్టేబుల్ డి.నాగేశ్వరావు, హోంగార్డు అయూబ్ సహకరించారు.

1050
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles