అత్తింటివారి వేధింపులు భరించలేక గృహిణి ఆత్మహత్య

Wed,September 11, 2019 06:32 AM

 Woman sets herself on fire after alleged torture by husband, in-laws

కాచిగూడ: అత్తంటివారి వేధింపులు భరించలేక ఓ గృహిణి ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన కాచిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఏసీపీ సుధాకర్ కథనం ప్రకారం.. బర్కత్‌పురలోని ఆర్టీసీ డిపో లైన్‌లో నివాసముండే ఎల్లయ్య, సత్తెమ్మ దంపతుల కూతురు గౌతమి(31)కి రాణిగంజ్, గ్యాస్‌మండి ప్రాంతానికి చెందిన మధుకర్‌తో జూలై 2018లో వివాహం జరిగింది. పెండ్లి సమయంలో యువతి తల్లిదండ్రులు రూ.18 లక్షల కట్నం ఇచ్చారు. గౌతమి నాంపల్లిలోని హకా భవన్‌లో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తుంది. కాగా..కొన్ని రోజులుగా గౌతమిని భర్త, అత్త అరుణా జ్యోతి, ఆడపడుచులు శిరీష, లత, స్వప్నలు వేధిస్తున్నారు. చిన్న విషయానికి కూడా గౌతమితో గొడవ పడుతున్నారు.

ఈ విషయమై పలుమార్లు గౌతమి తల్లిదండ్రులు మధుకర్‌కు చెప్పినా వేధిస్తూనే ఉన్నారు. అత్తింటివారి బాధలు భరించలేక గత బోనాల పండుగకు తల్లిదండ్రుల ఇంటికి వచ్చిన గౌతమి అక్కడే ఉంటుంది. జీవితంపై విరక్తి చెందిన గౌతమి మంగళవారం ఉదయం ఇంట్లో ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కాగా.. తన బిడ్డ చావుకు భర్త మధుకర్, అత్త అరుణాజ్యోతి, ఆడపడుచులు శిరీష,లతలే కారణమని, వారి వేధింపులతోనే గౌతమి ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తండ్రి ఎల్లయ్య ఆరోపించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గౌతమి భర్త, అత్త , ఆడపడుచులపై కేసు నమోదు చేసి...మధుకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

1330
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles