పెళ్లికి నో చెప్పిందని.. ఫేస్‌బుక్‌లో యువతి ఫొటోలు

Tue,August 20, 2019 07:42 PM

youth arrested for post Objectionable photos of woman

హైదరాబాద్‌: యువతిని వేధించిన యువకులు కటకటాల పాలయ్యారు. తనను పెళ్లిచేసుకోవడానికి నిరాకరించిందనే అక్కసుతో ఓ యువతికి చెందిన ఫొటోలు, ఫోన్‌నంబర్లను సోషల్‌ మీడియలో పోస్ట్‌ చేసిన ఘటన హైదరాబాద్‌లో జరిగింది. మానసికంగా వేధిస్తున్న వ్యక్తితో పాటు అతనికి సహకరించిన వారిని రాచకొండ పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేశారు. ఘట్కేసర్‌ మండలం అంకుశాపూర్‌లో ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. సోషల్‌ మీడియాలో యువతిని వేధిస్తున్న కేసులో వీరిని అరెస్ట్‌ చేశారు. అంకుశాపూర్‌కు చెందిన ఓ యువతిని పెళ్లి పేరుతో రాకేశ్‌ అనే యువకుడు కొద్దిరోజులుగా వేధిస్తున్నట్లు ఆరోపణలొచ్చాయి. ఐతే ఆమె పెళ్లికి నిరాకరించడంతో ఆమె ఫొటోలు, ఫోన్‌ నంబర్‌ ఫేస్‌బుక్‌లో పెట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రాకేశ్‌తో పాటు అతనికి సహకరించిన స్నేహితులు మహేశ్‌, గౌస్‌లను కూడా అరెస్ట్‌ చేశారు. ముగ్గురిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు చెప్పారు.

3122
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles