లైసెన్స్‌ల ఆన్‌లైన్ తీరు బేష్...

Fri,July 12, 2019 02:27 AM

ఖమ్మం వ్యవసాయం: జిల్లా మార్కెటింగ్‌శాఖ పరిధిలో వ్యాపారుల లైసెన్స్‌ల ఆన్‌లైన్ ప్రక్రియ త్వరిత గతిన చేప ట్టడం పట్ల మార్కెటింగ్‌శాఖ వరంగల్ రీజియన్ జా యింట్ డైరక్టర్ ఈ మల్లేశం సంతృప్తి వ్యక్తం చే శారు. గురువారం సాయంత్రం ఆర్జేడీ నగర వ్యవసాయ మార్కెట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా మార్కెట్ పరిధిలో ఉన్న ఖరీదుదారులు, అడ్తీ వ్యాపారుల లైసెన్స్‌ల ఆన్‌లైన్ పక్రియను ఆయన పరిశీలించారు. అనంతరం జిల్లా మార్కెటింగ్‌శాఖ అధికారి సంతోష్‌కుమార్‌తో కలిసి ఆయన ఆయా మార్కెట్లకు చెందిన కార్యదర్శులతో సమీక్ష చేశారు. లైసెన్స్‌లకు సంబంధించిన పక్రియ త్వరిత గతిన పూర్తి చేయాలని ఆయన సూచించారు. మార్కెటింగ్‌శాఖ పరిధిలో నూతనంగా ప్రవేశబెట్టబోతున్న ఈ సర్విసెస్ విధానం అమల్లోకి రాబోతుందన్నారు. ఈ ప్రక్రియ సజావుగా జరగాలంటే ప్రతి లైసెన్స్‌ను ఆన్‌లైన్ పరిధిలోకి తీసుకరావాలన్నారు. అనంతరం ఆయా మార్కెట్లలో ఇతర మార్కెట్‌కు చెందిన వ్యాపారులు కొనుగోలు చేసిన పంట ఉత్పత్తులను రవాణా చేసేందుకు గాను మార్గం సులభతరం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం ఏఎంసీ గ్రేడ్-టూ అధికారి బజార్, ఆయా మార్కెట్ల బాద్యులు పీ శ్రీనివాస్, టీ కిరణ్‌కుమార్, ఆర్ రాజేంద్రప్రసాద్, కె శంకర్‌తో పాటు ఖమ్మం మార్కెట్ కమిటీ ఉద్యోగులు తదితరలు పాల్గొన్నారు.

45
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles