కేటీపీఎస్‌కు గ్రీన్‌టెక్ అవార్డు..

Sun,July 14, 2019 01:06 AM

- అవార్డు అందుకున్న కేటీపీఎస్ సీఈ
పాల్వంచ, జూలై13: కేటీపీఎస్ 5,6 దశల కర్మాగారం 2018-19 గ్రీన్‌టెక్ అవార్డును సీఈ ఆనందం అందుకున్నారు. ఈ సందర్భంగా కేటీపీఎస్‌లోని 5,6 దశల కర్మాగారం అధికారులు అయనను శనివారం అభినందించారు. ఢిల్లీకి చెందిన గ్రీన్‌టెక్ పౌండేషన్ వారు ప్రతి సంవత్సరం పారిశ్రామిక రంగంలో పర్యావరణ సంరక్షణకు తీసుకుంటున్న కర్మాగారాల పోటీలలో రాష్ట్రంలోని మిగిలిన అన్ని జెన్కో స్టేషన్ల కంటే పాల్వంచలోని కేటీపీఎస్ 5,6 దశల కర్మాగారంలో వారు తీసుకుంటున్న పర్యావరణ సంరక్షణలో అన్ని విధాలుగా ముందంజ ఉండటంతో 2018-19 ప్లాటినమ్ అవార్డును వరించింది. ఈనెల 11వ తేదీన ఢిల్లీలోని విధాత తాజ్ హోటల్‌లో ఈ అవార్డును సీఈ అందుకున్నారు. ఈ సందర్భంగా టీఎస్ జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు కూడా సీఈనికి అభినందనలు తెలిపారు. అలాగే కేటీపీఎస్‌లోని ఇంజనీర్లు, అధికారులు ఆయనను శనివారం కలుసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కర్మాగారంలోని ఇంజనీర్లు, కార్మికులు, ఆర్టీజన్ల కృషి ఫలితంగానే ఈ అవార్డు వచ్చిందన్నారు.

అలాగే దీని కంటే ముందుగా అందరి సహయసహకారాలతో ఈ ఏడాది దేశంలోని అన్ని విద్యుత్ కర్మాగారాల కంటే అత్యధిక ఫీఎల్‌ఎఫ్ సాదించి ప్రథమ, ద్వితీయ, తృతీయ అవార్డులను అందుకోవడం జరిగిందని ఆయన వెల్లడించారు. భవిషత్తులో కూడా ఇదే విధంగా అందరూ కలిసికట్టుగా పనిచేసి అత్యధిక విద్యుత్ ఉత్పత్తికి కృషి చేసి రాష్ర్టానికి, జెన్కోకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఈలు కాటం సంజీవయ్య, కృష్ణయ్య, వరప్రసాద్, ఆరుద్ర, అనిల్‌కుమార్, డీఈ నందిపాటి బాస్కర్, ఎస్పీఎఫ్ సీఐ రాజు తదితరులు పాల్గొన్నారు. రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుని సమస్యకు స్పందించిన కేటీఆర్..

38
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles