పార్టీ బలోపేతానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలి

Mon,July 15, 2019 02:51 AM

కాంగ్రెస్ నుంచి 200మంది టీఆర్‌ఎస్‌లో చేరిక
కండువాలు కప్పి ఆహ్వానించిన
ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు

కొత్తగూడెం నమస్తేతెలంగాణ: సింగరేణి కొత్తగూడెం ఏరియా రామవరంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎండీ గౌస్,ఆవునూరి చంద్రయ్య, గొర్రె బాబూరావుల సమక్షంలో సుమారు 200 మంది కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు. కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు సమక్షంలో వారు పార్టీలో చేరారు. ఈసందర్భంగా పార్టీలో చేరిన వారందరికీ కండువాలు సాధరంగా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమా మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు నచ్చి వారంతా టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారన్నారు. రానున్న రోజుల్లో కొత్తగూడెం నియోజకువర్గం అంతా టీఆర్‌ఎస్‌మయం అవుతుందని అన్నారు. ప్రతీ కార్యకర్తకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. పార్టీ బలోపేతం కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని పిలుపు నిచ్చారు.

ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని, వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు పెంచిన పింఛన్లు వచ్చే నెల నుం ఇస్తుందని అన్నారు. ఎవరికి ఎలాంటి భయమూ ఉండదని, ప్రతీ ఒక్కరికి పెద్ద కొడుకులా ఉంటానని ఎమ్మెల్యే వనమా అభయమిచ్చారు. సింగరేణి బొగ్గు బావుల కోసం లీజుకు తీసుకున్న ప్రభుత్వ భూమి లీజు ఏనాడో అయిపోయిందని, ఆభూముల్లో నివశించే వారందరికీ పట్టాలిస్తానని అన్నా రు. ఈచేరికల కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు వనమా రాఘవేంద్రరావు, జడ్పీటీసీ గిడ్ల పరంజ్యోతిరావు, కాసుల వెంక ట్, మోరె భాస్కర్, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

48
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles