నిరుపేదలకు అండగా సీఎంఆర్‌ఎఫ్..

Wed,July 17, 2019 03:59 AM

వైరా, నమస్తే తెలంగాణ, జూలై16: రాష్ట్రంలో ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ అన్నారు. వైరాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని వైరా, జూలురుపాడు, ఏన్కూరు మండలాలకు చెందిన 16 మంది అనారోగ్య బాధిత లబ్ధిదారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ మంజూరు చేసిన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను మంగళవారం ఎమ్మెల్యే పంపిణీ చేశారు. మొత్తం 16 మంది లబ్ధిదారులకు వైరా జడ్పీటీసీ బొర్రా ఉమాదేవి, ఎంపీపీ వేల్పుల పావనిలతో కలిసి రూ.2.72 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే రాములునాయక్ ప్రసంగించారు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి పాలకులు ప్రజారోగ్యం గురించి పూర్తిగా విస్మరించారని విమర్శించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలనే లక్ష్యంతో సీఎంఆర్‌ఎఫ్‌ను పకడ్బందీగా అమలు చేస్తున్నారని వివరించారు. రాష్ట్రంలోని అనారోగ్య బాధితులందరికీ నాణ్యమైన వైద్యసేవలు అందించడమే టీఆర్‌ఎస్ ప్రభుత్వం లక్ష్యమన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా అత్యవసర విభాగాలు ఏర్పాటు చేసి అత్యంత నాణ్యమైన వైద్యాన్ని రోగులకు అందిస్తున్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకున్న అనారోగ్యులకు సీఎంఆర్‌ఎఫ్ ద్వారా ఆ వైద్య ఖర్చుల నగదును ప్రభుత్వం అందజేస్తుందన్నారు. సీఎంఆర్‌ఎఫ్ కింద లబ్ధిదారుడు దరఖాస్తు చేసుకున్న నాటి నుంచి నెలరోజులలోపే నిధులు మంజూరు చేసేలా ప్రభుత్వం ప్రణాళికా రూపొందిస్తుందని చెప్పారు. విద్య, వ్యవసాయం, వైద్య రంగాల్లో గుణాత్మకమైన మార్పులు ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకవచ్చారని కొనియాడారు. వైరాలోని 10 పడకల ఆసుపత్రిని 30 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు. సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమహ సహకారాలతో వైరాను మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కొణిజర్ల, జూలూరుపాడు, ఏన్కూరు జడ్పీటీసీలు సోమ్లానాయక్, కళావతి, బాదావత్‌బుజ్జి, టీఆర్‌ఎస్ జిల్లా నాయకులు సూతకాని జైపాల్, మోరంపూడి ప్రసాద్, పసుపులేటి మోహన్‌రావు, నాయకులు మిట్టపల్లి నాగి, ముళ్ళపాటి సీతారాములు, దార్న రాజశేఖర్, శీలం వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు.

34
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles