వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి

Mon,February 11, 2019 02:07 AM

ఔటర్‌పై డీసీఎం డ్రైవర్ ...
శంషాబాద్ : ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో డీసీఎం డ్రైవర్ దుర్మరణం చెందా డు. శంషాబాద్ రూరల్ పోలీసుల వివరాల ప్రకారం...కర్నాటక, బీదర్ జిల్లా హుమ్నాబాద్‌కు చెందిన రమేశ్(30) డీసీఎం డ్రైవర్. శనివారం పటాన్‌చెరువు నుంచి కోల్‌కత్తాకు ప్లాస్టిక్ లోడ్‌తో బయలుదేరాడు. శంషాబాద్ వైపు నుంచి ఔటర్ రింగ్‌రోడ్డుపై వెళ్తూ ... అర్ధరాత్రి శంషాబాద్ మం డలం పెద్దగోల్కొండ పరిధిలో డీసీఎంను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రమేశ్ డ్రైవింగ్ సీటులోనే ఇరుక్కుపోయి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం కోసం ఉస్మానియా మార్చురీకి తరలించారు. డీసీఎం ముందు భాగం నుజ్జు నుజ్జు అయింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

406

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles