బాధ్యతగా వ్యవహరించారు దుండగులను పట్టించారు

Thu,March 14, 2019 11:54 PM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : సెల్‌ఫోన్ దొంగలను పట్టుకోవడంలో కీలక పాత్ర పోశించిన ముగ్గురు పౌరులను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ గురువారం పోలీసు కమిషనర్ కార్యాలయంలో సత్కరించారు. బుధవారం రాత్రి తార్నాక ప్రాంతంలో గుర్తు తెలియని యువకులు ఓ వ్యక్తి నుంచి మొబైల్ ఫోన్‌ను లాగేసుకుని పారిపోతుండగా ఇది గమనించిన ధీరజ్‌కుమార్, ప్రమోద్, శ్రీకాంత్‌లు దుండగులను వెంబడించి స్నాచర్‌ల ఆనవాలు, బైక్ వివరాలను డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించారు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు మెట్టుగూడ ైస్కెలాబ్ హోటల్ వద్ద స్నాచర్‌లను పట్టుకున్నారు. ఈ ఇద్దరు మల్కాజిగిరి, లాలాగూడ, నల్లకుంట పోలీసు స్టేషన్‌పరిధిలో మొత్తం 9 మొబైల్ ఫోన్‌లతో పాటు రూ.2500 నగదు ఉన్న ఓ బ్యాగ్‌ను స్నాచింగ్ చేసినట్లు తేలింది. వారిని అరెస్టు చేసి గురువారం కోర్టులో హాజరుపర్చారు. అయితే పోలీసుల విచారణలో వారు మైనర్లుగా తేలింది. కాగా దుండగులను పట్టుకునేందుకు పౌరులు ప్రదర్శించిన ధైర్య సాహసాలను మెచ్చుకుంటూ సీపీ అంజనీకుమార్, ఇతర ఉన్నతాధికారులు వారిని సన్మానించారు.

358

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles