మహిళా రక్షణలో..దేశంలోనే నం.1

Thu,March 14, 2019 11:55 PM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : మహిళల భద్రత.. మన అందరి బాధ్యత అనే నినాదంతో హైదరాబాద్ షీ టీమ్స్ ఆధ్వర్యంలో మార్చి 17వ తేదీన నెక్లెస్ రోడ్డులో నిర్వహించనున్న వీఆర్ -1 రన్‌కు భారీ స్పందన వస్తుందని హైదరాబాద్ షీ టీమ్స్ ఇన్‌చార్జి, అదనపు పోలీసు కమిషనర్ షికా గోయల్ అన్నారు. గురువారం రన్ కొనసాగే రూట్ మ్యాప్‌ను విడుదల చేయడంతో పాటు పాల్గొన్న వారికి ఇచ్చే టీ షర్ట్‌లు, మెడల్స్‌ను ప్రదర్శించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ షీ టీమ్స్ వార్షికోత్సవం సందర్భంగా ఈ రన్‌ను ఏర్పాటు చేశామన్నారు. సిటీ పోలీసులు, షీ టీమ్స్ తీసుకుంటున్న చర్యలతో దేశంలోనే మహిళలకు రక్షణ కల్పిస్తున్న సురక్షితమైన నగరంగా హైదరాబాద్ పేరొందిందని తెలిపారు. 4వ షీ టీమ్స్ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న వీఆర్-1 రన్‌తో మహిళల భద్రత మన అందరీ బాధ్యత అని గుర్తుచేయడంతో పాటు జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తామన్నారు. ఈ రన్‌కు ఇప్పటి వరకు 5 వేల మంది దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. మార్చి 16 వరకు నగర వాసులు ఈ రన్‌లో పాల్గొనేందుకు భరోసా కేంద్రం, ఆన్‌లైన్‌లో మధ్యాహ్నం 3 గంటల వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించామన్నారు.

రేపు పీపుల్స్ ప్లాజా వద్ద
రన్‌కు ముందు రోజు శనివారం మార్చి 16న సాయం త్రం పీపుల్స్ ప్లాజా వద్ద సాయంత్రం 6.30 గంటలకు పలు సంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. అదేవిధంగా మహిళల భద్రత, పిల్లలపై లైంగిక దాడుల అంశాలకు సంబంధించి రూపొందించిన రెండు పుస్తకాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి విడుదల చేస్తారని తెలిపారు.

227

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles