భారీ మెజార్టీతో గెలిపించాలి

Sat,March 23, 2019 03:01 AM

- టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఎండీ జహంగీర్, ఎంపీపీల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బి.చంద్రశేఖర్‌యాదవ్
శామీర్‌పేట : సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి మర్రి రాజశేఖర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఎండి.జహంగీర్, ఎంపీపీల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బి. చంద్రశేఖర్‌యాదవ్ అన్నారు. ఎంపీ అభ్యరి మర్రి రాజశేఖర్‌రెడ్డిని ఆయన నివాసంలో శుక్రవారం కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థిని దేశంలోనే భారీ మెజారిటీతో గెలిపించి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బహుమతిగా అందిస్తామని తెలిపారు. ఇందుకు ప్రతీ నాయకుడు, కార్యకర్తలు సిద్ధం కావాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ల సంఘం మండల అధ్యక్షుడు మోహన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కుమార్‌యాదవ్, ఎంపీటీసీ సుదర్శన్, మాజీ ఎంపీపీ యాదగిరి, మాజీ సర్పంచ్‌లు బి.కిశోర్‌యాదవ్, ఈ.శ్రీనివాస్, నాయకులు అశోక్‌రెడ్డి, మురళిగౌడ్, జగదీశ్‌గౌడ్, లావణ్యనర్సింహ్మరెడ్డి, మల్లేశ్‌యాదవ్, శంకర్‌యాదవ్, వార్డు సభ్యులు లింగం, కిశోర్, మధు, శ్రీనివాస్, నాగేశ్, మైసయ్య, నర్సింగ్‌రావు, నరేశ్‌గౌడ్, రాఘవరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

265

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles