నాలుగు జంటలకు నవకార్ వివాహం

Mon,April 22, 2019 12:29 AM

నమస్తే తెలంగాణ, సిటీబ్యూరో: ఆ జంటలు నగరానికి చెందిన యువకులు. పెళ్లి చేసుకోవడానికి ఆర్థిక స్థోమత లేక ఎవరో చెప్పిన చిన్న సమాచారంతో ఒకరొకరుగా నవకార్ దర్శన్ అనే ప్రసిద్ధి గాం చిన ఆర్గనైజేషన్‌ను కలిశారు. ఈ నాలుగు జంటలకు ఆ స్వచ్ఛంద సంస్థ ఆదివారం పెళ్లి చేసి, చీరె సారె పెట్టి ఆశీర్వదించింది. ఈ నవ కార్ దర్శన్ ఆర్గనైజేషన్ గత తొమ్మిదేళ్లుగా మానవతా దృక్పథం తో కూడిన ఎన్నో రకాల స్వచ్ఛంద సేవలను, కార్యక్రమాలను తెలం గాణ రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతోంది. నవకార్ దర్శన్ ఆర్గనైజేషన్‌ను కవితా జైన్ ప్రారంభించారు. సికింద్రాబాద్ - అడ్డగుట్టకు చెందిన జంట పవన్ - రేఖ, పంజాగుట్టకు చెందిన శ్రీహరి - సుమలత, కూకట్ పల్లికి చెందిన రాజ్ కుమార్ - తిరుమల పద్మావతి, మహేం ద్ర హిల్స్‌కు చెందిన శ్రీకాంత్ -ఆమనిలు ఆ నాలుగు జంటలుగా ఉన్నా రు. వీరంతా కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, ఎమ్మె ల్సీ రాంచందర్ రావు, అశోక్ బోరా, సంపత్ర కొఠారి, ఇంకా ప్రదీప్ సూరన మొదలైన ప్రముఖుల ఆశీస్సులను పొందారు.

286

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles