24 నుంచి ఓపెన్ స్కూల్ పరీక్షలు

Mon,April 22, 2019 12:33 AM

మేడ్చల్ జిల్లా, నమస్తే తెలంగాణ ప్రతినిధి : ఓపెన్ స్కూల్ వార్షిక పరీక్షలకు మేడ్చల్ జిల్లాలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 24 నుంచి ఇంటర్, ఎస్సెస్సీ అభ్యర్థులకు రాతపరీక్షలు ప్రారంభంకానున్నాయి. 24న ప్రారంభమైన పరీక్షలు ఇంటర్ అభ్యర్థులకు మే 6వ తేదీ వరకు, ఎస్సెస్సీ విద్యార్థులకు మే 9వ తేదీ వరకు జరగనున్నాయి. జిల్లాలో ఇంటర్ విద్యార్థుల కోసం 4 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా, 895 మంది విద్యార్థులు, ఎస్సెస్సీ వారి కోసం 8 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా 1981 మంది అభ్యర్థులు పరీక్షలు రాయబోతున్నారు. ఉదయం 8.30 గంటల నుంచి, మధ్యాహ్నం 11.30 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. జిల్లాలోని అధికారులు సమన్వయంతో పనిచేసి ఓపెన్ స్కూల్ పరీక్షలను సజావుగా నిర్వహించాలని జిల్లా విద్యాధికారిణి ఐ.విజయకుమారి అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో అన్ని రకాల వసతులు కల్పించామని, అన్ని పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, ఫర్నిచర్, నిరంతర విద్యుత్, బందోబస్తు, ఆరోగ్య సదుపాయాలు, పారిశుధ్యం సహా ఇతర సదుపాయాలు కల్పించామని తెలిపారు. విద్యార్థుల సంఖ్యకు సరిపోయేలా ఆర్టీసీ బస్సులను నడపాలని ఆర్టీసీ అధికారులను కోరారు.

282

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles