జీవజాలాన్ని కాపాడుకుందాం..

Mon,April 22, 2019 12:34 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : జంతువులు.. జీవజాలం.. ఒకప్పుడు మన పరిసరాల్లోనే ఉండేవి. కానిప్పుడు జూపార్కుల్లో దర్శనమిస్తున్నాయి. కారణం అభివృద్ధి, పారిశ్రామిక విప్లవం. ఈ రెండింటి పుణ్యమా అని కాలుష్యం కోరలు చాచుతున్నది. గాలి, నీరు కాలుష్యం వల్ల నేలపై అనేక జీవజాతులు అంతరించిపోయే ప్రమాదం ఏర్పడింది. ఆధునికతకు మారుపేరైన మోటార్ కార్లు, ఏసీలు గ్లోబల్ వా ర్మింగ్, ఓజోన్ పొర తరిగిపోవడానికి కారణంగా మారుతున్నాయి. ఇవి వాతావరణం లో మార్పులకు కారణమవుతుండగా, వీటి పర్యవసానాలు ఎంతో ప్రమాదకరస్థాయికి చేరుకున్నాయి. కర్మాగారాలు, ధార్మిక పవర్ స్టేషన్లు, గాలిలోకి విషపూరిత వాయువులను వదలడం వల్ల విషపూరితమై ఎన్నో జీవులు అంతరించిపోయేందుకు కారణాలుగా నిలుస్తున్నాయి. నేడు ప్రపంచ ధరిత్రి దినం. ప్రొటెక్ట్ అవర్ స్పీసెస్ (మన జంతుజాలాన్ని పరిరక్షించుకుందాం) అనే థీమ్‌తో ఐక్య రాజ్యసమితి నిర్వహించనున్నారు.

ఉనికి కోల్పోతున్న జీవజాలం
చట్ట వ్యతిరేక వాణిజ్యం, మాంసం అతిగా వాడుకవల్ల ఎన్నో జాతులు ప్రమాదపు అంచుకు చేరుకున్నాయి. 1979లో ఆఫ్రికాలో 13 లక్షల ఏనుగులున్నట్లు అంచనా కాగా, ప్రస్తుతం వాటి సంఖ్య కేవలం 6,50,000లకు పడిపోయింది. వేడిమినిచ్చే ఉన్ని కోసం కూడా కొన్ని రకాల జంతువులను వేటాడడం అలవాటుగా మారింది. ఇది కూడా జీవవైవిధ్యం విఘాతానికి ఓ కారణంగా చెప్పవచ్చు. ముఖ్యంగా ఉష్ణమండల ప్రాంతంలో ఆవాసాలు, ఇతర జీవావరణ వ్యవస్థల ధ్వంసం కారణంగా రానున్న 20-30ఏండ్లలో ప్రపంచంలోనే నాల్గొవ వంతు జీవవైవిధ్యం నశించిపోయే ప్రమాదం ఉన్నట్లు శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. 1600వ సంవత్సరం నుంచి 1900వ సం. మధ్య ప్రతి నాలుగేండ్లకు ఒక జాతిచొప్పున అం తం చెందగా, 1900వ సంవత్సం తరువాత సగటున ప్రతి యేటా ఒక జాతి చొప్పున అంతరిస్తున్నట్లు గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. గత 400ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా 120క్షీరదాల జాతులు, మరో 225పక్షిజాతులు అంతరించినట్లు పరిశోధనల్లో తేలింది.
-దంతాల కోసం జరిపే వేట కారణంగా ఆఫ్రికా ఏనుగుల సంఖ్య సగానికి పడిపోయింది.
-వినోద క్రీడలవల్ల మారిషస్‌లో సింహాలు, పులులు ఉనికి కోల్పోయాయి.

-మాసం కోసం వేటాడటం కారణంగా డోడో అనే పక్షజాతి అంతమయ్యింది.
-గోర్లు, చర్మం, ఇతర శరీర అవయవాల కోసం పులులను వేటాడడం వల్ల వాటి సంఖ్య పూర్తిగాతగ్గిపోయింది.
-పాములు, మొసళ్ల వేట కూడా అధికంగా ఉండటంతో అవి సైతం కనుమరుగవుతున్నాయి.
-ప్రపంచీకరణతో వెయ్యి నుంచి పదివేల రెట్ల జీవజాతులు అనవాళ్లు కోల్పోయాయి.
కనుమరుగైన చీతా..
చీతా మన దేశంలో ఎప్పుడో అంతరించిపోయింది. ఉత్తర, మధ్య భారతంతోపాటు దక్కన్‌లోని మైసూరు ప్రాంతంలో ఒకప్పుడు విస్తారంగా ఉన్న చీతాలు క్రమంగా వాటి ఆవాసాలు నాశనం కావడం, వేటల, ఆహారానికి ఉపయోగపడే జంతువుల కొరత తదితర కారణాల వల్ల పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. చీతాను చివరిసారి 1984లో మధ్యప్రదేశ్‌లోని బస్తర్ ప్రాంతంలో చూసినట్లు ఆనవాళ్లు దొరికాయి.
ప్రమాదపుటంచున మృగరాజు
ఇక మృగరాజు సింహ విషయానికికొస్తే, ఇదీ చితాకు భిన్నమేమీ కాదు. ఉత్తర, మధ్య భారత్‌లో విస్తారంగా పెరిగిన ఇవి ఇప్పుడు గుజరాత్‌లోని గిర్ అభయారణ్యానికి పరిమితమయ్యాయి. వినోదం కోసం వేట వల్ల ఒక దశలో వీటి సంఖ్య 15కు తగ్గిపోయింది. 1955లో ప్రభుత్వం సింహాల వేటను నిషేధించింది. అంతేకాకుండా 1965లో 1260 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో గిర్ వన్యప్రాణి అభయారణ్యాన్ని ఏర్పాటుచేసింది. ఇది ప్రారంభం నాటికి సింహాల సంఖ్య 170ఉండగా, 1995నాటికి 300లకు చేరుకుంది. 1957లో సంహాలను పెంచే లక్ష్యతో ఉత్తరప్రదేశ్‌లోని చంద్రప్రభ అభయారణ్యానికి ఒక మగ సిం హం, రెండు ఆడసింహాలను పంపగా, అనంతరం వాటి సంఖ్య 11కు పెరిగింది.

371

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles