కాలజ్ఞానం బోధించిన తత్వవేత్త ‘పోతులూరి’

Wed,May 15, 2019 12:46 AM

కవాడిగూడ: శ్రీ మద్విరాట్‌ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి 326వ ఆరాధన మహోత్సవాలు ఉత్సవ సమితి కన్వీనర్‌ అడ్లూరి రవీంద్రాచారి ఆధ్వర్యంలో మంగళవారం ట్యాంక్‌బండ్‌పై నున్న వీరబ్రహ్మేద్రస్వామి విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. మాజీ స్పీకర్‌ మధుసూదనాచారి, మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరై వీరబ్రహ్మేంద్ర స్వామివారికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ స్పీకర్‌ మధుసూదనాచారి మాట్లాడుతూ వీరబ్రహ్మేంద్రస్వామి వారు చెప్పిన కాలజ్ఞానం వేదవాక్కులుగా నాటికి, నేటికి నిజమవుతున్నాయన్నారు. కాలజ్ఞాన కర్తగా, దార్శనికునిగా, సంఘ సంస్కర్తగా కీర్తించబడిన వారి ని ఒక కులానికి పరిమితం చేయడం బాధకలిగిస్తుందన్నారు. అనంతరం మాజీ హోంమంత్రి నాయని నర్సింహారెడ్డి మాట్లాడుతూ తమ తత్వాలతో సామాజిక విప్లవాన్ని సాధించిన మహనీయుడు వీరబ్రహ్మేంద్రస్వామి అన్నా రు. ఈ సందర్భంగా పెందోట రామస్వామి, సుశీల దంపతులు కార్యక్రమంలో పాల్గొన్న వారికి పడి, పులిహోర ప్రసాదాలను పంపిణీ చేశారు. రుంజ కళాకారుడు అమర్‌నాథ్‌ రుంజ వాయిస్తూ వీరబ్రహ్మేంద్ర స్వామివారి తత్వాలను గానం చేశారు. సంఘం నాయకులు లాల్‌కోట వెంకటాచారి, వేములవాడ మధన్‌మోహన్‌, పద్మాచారి, రాయబండి పాండురంగాచారి, మల్యాల కృష్ణాచారి, యాదగిరి, వెంకటాచారి, తంగెళ్లపల్లి రమేష్‌ తదితర విశ్వబ్రాహ్మణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

345

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles