ఇంకుడు గుంతలతో భూగర్భ జలాలు పెంచవచ్చు

Sun,May 19, 2019 02:36 AM

-మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
మారేడ్‌పల్లి : వృథా నీటిని భూమిలోకి ఇంకిపోయే విధంగా జాగ్రత్తలు తీసుకోవడం వలన భూగర్భ జలాలు పెంచవచ్చని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం వెస్ట్‌మారేడ్‌పల్లిలోని తన నివాసం వద్ద కార్పొరేటర్ ఆకుల రూప, జీహెచ్‌ఎంసీ కో-ఆప్షన్ సభ్యుడు సీఎన్ నర్సింహ ముదిరాజ్, జలమండలి అధికారులతో కలిసి ఇంకుడు గుంత అభివృద్ధి పనులు చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. ఇంకుడు గుంతల నిర్మాణంతో భూగర్భ జలాలు పెంపొందించవచ్చన్నారు. ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతల ప్రాధాన్యత గుర్తించాలని కోరారు. కార్యక్రమంలో వాటర్ వర్క్స్ జీఎం రాజశేఖర్, డీజీఎం విజయ్‌రావు, రమణ, జీహెచ్‌ఎంసీ అధికారులు సునీల్, ప్రశాంతి, చైతన్య తదితరులు పాల్గొన్నారు.

మారేడ్‌పల్లి జలమండలి కార్యాలయంలో...
మారేడ్‌పల్లి జలమండలి కార్యాలయంలో శనివారం వాటర్ హార్వెస్టింగ్ డే కార్యక్రమంలో భాగంగా నీటి గుంతలో జలమండలి డైరెక్టర్ విజయ్‌కుమార్‌రెడ్డి, సీజీఎం విజయరావు, వాటర్ బోర్డు కన్సల్టెంట్ స్నేహలత, జీఎం రాజశేఖర్, డీజీఎం సంతోశ్ ఇసుక వేసి కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో జలమండలి సిబ్బంది రమణ, సునీల్, కృష్ణ పాల్గొన్నారు.

లేపాక్షి కాలనీలో...
ఇంకుడు గుంతల ఏర్పాటుతో భూగర్భ జలాలు పెంపొందించి, నీటి సమస్య పరిష్కరించుకోవచ్చని స్థానిక కార్పొరేటర్ ఆకుల రూప అన్నారు. శనివారం డివిజన్ పరిధిలోని లేపాక్షి కాలనీలో ఇంకుడు గుంత అభివృద్ధి పనులు చేపట్టారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. బస్తీ, కాలనీల్లో ప్రతిఒక్కరూ తమ ఇండ్లల్లో, ఖాళీ స్థలాల్లో ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. దీంతో భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు.

209

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles