అన్నమయ్య... ఆరాధన..

Sun,May 19, 2019 02:37 AM

మాదాపూర్, మే 18: అన్నమయ్య సంకీర్తనల ప్రచారమే ఆమె ధ్యేయం .. అంకుటిత దీక్షతో 36 ఏండ్లుగా ఎన్నో సంకీర్తనలను ఆలపించి తనదైన శైలితో గుర్తింపు తెచ్చుకున్న అన్నమయ్య తొలివాగ్గేయకారిణి, పద్మశ్రీ డాక్టర్ శోభరాజు. అన్నమయ్య గొప్పతనాన్ని సంకీర్తనల రూపంలో ప్రపంచానికి చాటిచెప్పాలన్న ధృడ సంకల్పంతో 1983లో అన్నమాచార్య భావనావాహిని పేరుతో అన్నమయ్య క్షేత్రాన్ని స్థాపించింది. ప్రతి సంవత్సరం నిర్వహించే వేసవి వెన్నెల కార్యక్రమం పేరుతో దాదాపు 20వేలకు పైగా శిష్యులను (కళాకారులు) తయారు చేసి అన్నమయ్య సంకీర్తనల గొప్పతనాన్ని చాటి చెప్పారు. మాదాపూర్‌లోని అన్నమయ్యపురంలో కొలువుదీరిన అన్నమాచార్య భావనావాహినిలో అన్నమయ్య 611వ జయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వాహకురాలు శోభరాజు స్వయంగా అన్నమయ్య సంకీర్తనలను ఆలపించి ఆహూతులను అలరిపంజేశారు. అనంతరం శోభరాజు గానాలాపనతో కళాకారిణి శృతకీర్తి భావయామి గోపాలబాలం అనే సంకీర్తనకు నృత్య ప్రదర్శన చేసి భక్తులను ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చినజీయర్ స్వామి విచ్చేసి నిర్వాహకురాలు శోభరాజు స్వయంగా ఆలపించే సంకీర్తనల గానాన్ని వీక్షించారు.

332

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles