వృత్తి నైపుణ్యత పెంచుకుంటే.. రాణించొచ్చు

Sun,May 19, 2019 02:37 AM

తెలుగుయూనివర్సిటీ, మే 18: దేశంలో నానాటికీ రాజకీయాలు దిగజారిపోతున్నాయని ఈ పద్ధతే కొనసాగితే భవిష్యత్తును మరింత ఆందోళనకు గురిచేస్తుందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు. రెడ్‌హిల్స్‌లో గల ఫ్యాప్సీ ఆడిటోరియం లో శనివారం ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రెటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్‌ఐ) నిర్వహించిన స్నాతకోత్సవంలో ఆయన ప్రసంగిస్తూ రాజ్యాంగంలోని మూడుస్తంభాల్లో రెండింటి పనితీరు బాగా దిగజారిపోయిందన్నారు. దిగజారి పోతున్న వ్యవస్థల బాధ్యతలను మూడో స్తంభంలాంటి న్యాయ వ్యవస్థపై పడిందన్నారు. జాతీయ స్థాయిలో ఏ కంపెనీ అయినా రాణించాలంటే వృత్తి నైపుణ్యతపైనే ఆధారపడి ఉంటుందన్నారు. ఐసీఎస్‌ఐ అధ్యక్షుడు రంజిత్‌కుమార్ మాట్లాడుతూ క్రమశిక్షణ, స్థిరత్వం, పనితీరులో నూతనత్వం, సాంకేతికతను అనుకరించి వృత్తిలో ముందుకు సాగితే అభివృద్ధ్దిని సాధించడం సులభమన్నారు. ఈ సభలో ఐసీఎస్‌ఐ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులకు పట్టాలను ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు అశిష్‌గర్గ్, కౌన్సిల్ సభ్యు లు వి. అహ్లాదరావు, నాగేంద్ర డి రావు, రామసుబ్రమణ్యం, కార్యదర్శి అశోక్, ఎస్‌ఐఆర్‌సీ చైర్మన్ మోహన్ తదితరులు పాలొన్నారు.

290

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles