ఆరోగ్యవంతమైన సమాజమే లక్ష్యం

Sun,May 19, 2019 02:38 AM

తార్నాక, మే18 : ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ పని చేయాలని సీఎస్‌ఐఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ శేఖర్ మండే అన్నారు. తార్నాకలోని ది ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) లో విజ్ఞాన భారతి ఆధ్వర్యంలో విద్యార్థులకు విద్యార్థి విజ్ఞాన్ సంతన్ పేరుతో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి సైన్స్ టాలెంట్ టెస్ట్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. 18వ శతాబ్దంలోనే మనదేశంలో సైన్స్‌అండ్ టెక్నాలజీ ఎంతో అభివృద్ధ్ది చెందిందన్నారు. ఆ కాలంలోనే అనేక ఆవిష్కరణలు జరిగాయని, గతంలో మనకు అవసరమైన మందులు అధిక ధరలకు లభించేవన్నారు. అయితే అనేక ఆవిష్కరణల నేపథ్యంలో మందులు మార్కెట్‌లో చాలా చౌకగా లభిస్తున్నాయని, జనరిక్ మందులే అందుకు ఆధారమన్నారు.

మనిషి సగటు వయస్సును 125 ఏండ్లకు పెంచే దిశగా పరిశోధనలు : డాక్టర్ ఎస్.చంద్రశేఖర్
సాధారణంగా మనిషి సగటు వయస్సును 125 ఏండ్లకు పెంచే దిశగా ఐఐసీటీలో పరిశోధనలు జరుగుతున్నాయని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) డైరెక్టర్ ఎస్.చంద్రశేఖర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం 90 ఏండ్ల వయస్సు ఉండగా దానిని మరింత స్థాయికి పెంచే దిశగా వ్యాక్సిన్ల తయారీ జరుగుతుందన్నారు. అందుకు శాస్త్రవేత్తలు సమిష్టిగా ముందుకు వచ్చి ఈ వ్యాక్సిన్ తయారీపై తమ అనుభవాలను పంచుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్‌మిశ్రా మాట్లాడుతూ శాస్త్ర,సాంకేతికరంగాల్లో నూతన మార్పులను తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో విజ్ఞానభారతి జాతీయ అధ్యక్షుడు జయంత్‌సహస్త్ర బుద్దే, డిఎస్‌టీ అధ్యక్షుడు అరవింద్ రమావాడే, సీబీఎస్‌ఈ జాయింట్ సెక్రటరీ ప్రమోద్‌కుమార్, ఎన్‌సీఆర్‌టీఈ దినేశ్, విద్యార్థులు పాల్గొన్నారు.

274

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles