ఉక్కు వంతెనలు.. రైట్ రైట్

Sat,May 25, 2019 01:09 AM

-స్టీల్ బ్రిడ్జీల టెండర్ల ఖరారుకు చర్యలు
-రూ.949 కోట్లతో నిర్మాణం
-కూకట్‌పల్లి ఆర్‌యూబీకీ త్వరలో మోక్షం
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో టెండర్ల ప్రక్రియలోనే నిలిచి పోయిన రెండు స్టీల్ బ్రిడ్జీలు, ఒక ఆర్‌యూబీ పనులకు మోక్షం లభించింది. అత్యంత ట్రాఫిక్ రద్దీఉండే ప్రాం తాల్లో పనుల సం దర్భంగా వాహనదారులకు ఇబ్బంది కలుగకుండా చూడడంతోపాటు పనులను త్వరితగతిన పూర్తిచేసే ఉద్దే శంతో రెండు ప్రాంతాల్లో స్టీల్ బ్రిడ్జీలు నిర్మించాలని నిర్ణయించారు. ఎన్టీఆర్ స్టేడియం జంక్షన్ నుంచి వీఎస్‌టీ జంక్షన్ (రామ్ నగర్) వరకు, అలాగే రామ్‌నగర్ నుంచి బాగ్‌లింగంపల్లి వరకు రెండు లెవల్స్ స్టీల్ ైఫ్లెఓవర్‌ను నిర్మించేందుకు జీహెచ్‌ఎంసీ ప్రణాళికలు రూపొందించిన విషయం విధిత మే. దీని నిర్మాణానికి రూ. 426కోట్లు ఖర్చవుతుందని అం చనా. ఈ రెండు లెవెల్స్ ైఫ్లెఓవర్ మొత్తం పొడవు 3.45కిలోమీటర్లు. ఇందులో ఎన్టీఆర్ స్టేడియం జంక్షన్ నుంచి వీఎస్‌టీ జంక్షన్ వరకుగల ప్రధాన ైఫ్లెఓవర్ పొడవు 2.6కి.మీ.లు కాగా, రామ్‌నగర్ నుంచి బాగ్‌లింగంపల్లి వరకు నిర్మించే రెండే లెవెల్ ైఫ్లెఓవర్ పొడవు 0.84కి.మీ. లు. వీటి నిర్మాణంతో ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ నుంచి ముషీ రాబాద్, నారాయణగూడ వెళ్లే ట్రాఫిక్‌తోపాటు ఇందిరా పార్క్ నుంచి వీఎస్‌టీ, నల్లకుంట, బాగ్‌లింగంపల్లి తది తర ప్రాంతాలకు వెళ్లే ట్రాఫిక్‌కు ఎంతో ఉపశమనం లభి స్తుంది. 55అడుగుల వెలడ్పుతో కూడిన ఈ ైఫ్లెఓవర్ నాలుగు లేన్లతో కూడివుంది.

సౌకర్యం కోసమే .....
వాస్తవానికి ఈ మార్గంలో ైఫ్లెఓవర్ ప్రతిపాదన 15 సంవత్సరాలనుంచి పెండింగులో ఉంది. సాంప్రదాయ పద్ధతుల్లో ైఫ్లెఓవర్ నిర్మిస్తే భారీగా ఆస్తులు సేకరించాల్సి రావడమే కాకుండా నిర్మా ణం సందర్భంగా వాహనదారు లకు తీవ్ర అసౌకర్యం కలుగుతుంది. అత్యంత ప్రధాన మార్గమైన ఈ రోడ్డులో ట్రాఫిక్ అడ్డంకులకు ట్రాఫిక్ విభాగం నుంచి అనుమతులు వచ్చే పరిస్థితిలేదు. అంతే కాదు, భారీగా ఆస్తులు సేకరించాల్సి రావడంతో ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మా మూలు ైఫ్లెఓవర్ తో పోల్చితే దీని ఖర్చు దాదాపు 50శాతం వరకూ అధి కంగా ఉన్నప్పటికీ ప్రజల సౌకర్యం దృష్ట్యా స్టీలు బ్రిడ్జీలునిర్మించాలని నిర్ణయించారు. నల్గొండ క్రాస్‌రోడ్ నుంచి ఒవైసీ జంక్షన్ వరకు సుమారు రూ. 523కోట్ల వ్యయంతో మరో స్టీలు బ్రిడ్జీ నిర్మించేందుకు ఏర్పాట్లు ప్రారంభించారు. ఈ రెండు స్టీలు బ్రిడ్జీల నిర్మాణానికి ఇదివరకే టెండర్లు పిలువగా, పలు ఏజెన్సీలు ముందుకొచ్చాయి. టెండర్లను పరిశీలించి ఖరారు చేయా ల్సివుంది. అలాగే, హైటెక్‌సిటీ నుంచి కూకట్‌పల్లి మా ర్గంలో ఎంఎంటీఎస్ రైల్వేస్టేషన్ వద్ద సుమారు రూ. 50కోట్లతో ఆర్‌యూబీ నిర్మాణ ప్రతిపాదన ఉంది.

రైల్వేశాఖ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన వంతెన నిర్మాణం పూర్తయింది. కాగా, దానికి ఇరువైపులా రోడ్లను జీహెచ్ ఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేయాల్సివుంది. ఈ పనులకు సైతం టెండర్లు ఖరారుచేయాల్సివుంది. ఎన్నికల కారణంగా ప్రధాన వంతెనభాగం పూర్తయినా అప్రోచ్‌ల నిర్మాణం నిలిచిపోయింది. వీఎస్‌టీ-ఇందిరాపార్క్ జంక్షన్ ైఫ్లెఓవర్, నల్గొండ క్రాస్‌రోడ్-ఒవైసీ జంక్షన్ ైఫ్లెఓవర్, కూకట్‌పల్లి ఆర్‌యుబీ తదితర మూడు ప్రాజెక్టుల వ్యయం సుమారు రూ. 1000కోట్లవరకూ ఉంది. అసెంబ్లీ ఎన్నికలు, తరువాత ఎమ్మెల్సీ ఎన్నికలు, అనంతరం పార్లమెంటు ఎన్నికలు వరుసగా రావడంతో దాదాపు ఫిబ్రవరి నుంచి పనులు ముందుకు సాగడంలేదు. పార్లమెంట్ ఎన్నికలు పూర్తయిపోయిన నేపథ్యంలో వచ్చే సోమవారం నుంచి టెండర్ల ప్రక్రియ పూర్తిచేసేందుకు వారు ఏర్పాట్లు చేస్తున్నారు.

413

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles