రివార్డు మేళా..

Sun,May 26, 2019 12:21 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ :రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశాల మేరకు తీసుకుంటున్న చర్యలు, దర్యాప్తులో అవలంబిస్తున్న సరికొత్త పద్ధతులతో నేరం చేసిన నిందితులు శిక్ష పడకుండా తప్పించుకోలేరని రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ అన్నారు. శనివారం నేరేడ్‌మెట్ రాచకొండ పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హోంశాఖ ముఖ్యకార్యదర్శి రాజీవ్ త్రివేదితో కలిసి ఆయన పోలీసు, కోర్టు సిబ్బందికి రివార్డులను అందజేశారు. ఏప్రిల్, మే నెలలో పోలీసులు, కోర్టు సిబ్బంది సమన్వయంతో పూర్తి చేసిన 54 కేసుల విచారణలో మొత్తం 94 మంది నేరగాళ్లకు శిక్షలు పడ్డాయి. ఇందులో జీవిత ఖైదు నుంచి ఏడాది జైలు శిక్ష, జరిమానాల వరకు ఖరారయ్యాయని ఆయన వివరించారు. 17 వర్టికల్స్‌లో తమ విధులను సమర్ధవంతంగా నిర్వహించిన సిబ్బందికి కూడా హోం శాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది కీ పర్‌ఫార్మెన్స్ అవార్డులను అందిచారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డైరక్టర్ ప్రాసిక్యూషన్స్ ,డీసీపీలు ఉమ మహేశ్వరశర్మ, కే.నారాయణరెడ్డి, అదనపు డీసీపీలు శిల్పవల్లి, శ్రీనివాస్ పాల్గొన్నారు.

206

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles