విద్యుత్ వినియోగంలోకాస్తంత జాగ్రత్త..

Sun,May 26, 2019 12:22 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ :ఓవైపు సూర్యుడు భగభగమంటున్నాడు. మరోవైపు ఉక్కపోతకు ప్రజలు సాధారణ రోజుల్లో కంటే రెట్టింపు స్థాయిలో విద్యుత్ వినియోగం జరుగుతుంది. ఈ క్రమంలో లోడు అధికంగా పడటంతో అప్పుడప్పుడు లైన్లు ట్రిప్ అవుతుండడం సాధారణం. వీటితో పాటు వేడిమికి తీగలు తెగడం వంటివి జరుగుతుంటాయి. ఇండ్లల్లో తరచూ విద్యుత్ ఉపకరణాలు, లైన్లలో ఏవో ఒక మరమ్మతులు చేయాల్సి వస్తుంటుంది. అయితే ఈ క్రమంలో నిబంధనల ప్రకారం.. ప్రభుత్వం సర్టిఫైడ్ చేసిన ప్రైవేటు ఎలక్ట్రికల్ వర్కర్స్ ద్వారానే పనులు చేయించుకోవాల్సి ఉంటుంది. కానీ వినియోగదారులెవరూ ఈ నిబంధనలను పాటించడం లేదు. కొద్దిపాటి ఖర్చుకు భయపడి అందుబాటులో ఉన్న ప్రైవేటు కార్మికులతో మరమ్మతులు చేయిస్తున్నారు. ఫలితంగా వారికి విద్యుత్ పనులు చేసే క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన లేక ప్రమాదాల బారిన పడుతున్నారు.

వాస్తవంగా ప్రైవేటు విద్యుత్ కార్మికులను హెచ్‌టీ లైన్ల నిర్మాణ పనుల్లో మినహాయిస్తే.. మిగతా చోట్ల వినియోగించరు. హెచ్‌టీ నిర్మాణ పనుల్లోనూ అత్యంత అత్యాధునిక సెఫ్టీ విధానాలతో కార్మికులతో కాంట్రాక్టర్లు పనులు చేయిస్తారు. కానీ ఎల్‌టీ లైన్లలోనే ఇష్టారాజ్యంగా ప్రైవేటు కార్మికులు పనిచేస్తుండడంతో ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారు. విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిజన్లు, విద్యుత్ సిబ్బంది సైతం కొన్నిసార్లు ఎలాంటి ప్రమాద నివారణ చర్యలను పాటించడంలేదు. ఇటీవల జరిగిన రెండు మూడు ఘటనల్లో నిర్లక్ష్యమే ప్రమాదాలకు కారణమని నిపుణులు తేల్చారు. ఈ క్రమంలో విద్యుత్ ప్రమాదాలపై కథనం.

అతివిశ్వాసంతోనే ప్రమాదాలు..
విద్యుత్ పనులు చేసే సమయంలో విద్యుత్ కార్మికుల అతివిశ్వాసంతోనే ప్రమాదాలు చోటుచేసుకుంటుండడం గమనార్హం. ప్రధానంగా విద్యుత్ మరమ్మతులు చేసే సమయంలో విద్యుత్ కార్మికులు ప్రశాంతంగా ఉండాలి. చేసే పనుల పట్ల అజాగ్రత్తగా ఉండొద్దు. కొంతమంది అత్యుత్సాహంతో ఏలాంటి భద్రతా నిబంధనలను పాటించకుండా ప్రాణం మీదకి తెచ్చుకుంటున్నారు. పనితనంలో అనుభవం ఉండి.. సులభంగా పనులు చేసేవారు సైతం తమకు ఏంకాదులే అని ఏలాంటి జాగ్రత్తలు పాటించకుండా విద్యుత్ మరమ్మతులు చేస్తుండడం వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇండ్లలో వినియోగించే విద్యుత్ విషయంలో ఎర్తింగ్ ప్రధాన పాత్రను పోషిస్తుంది.. ఎర్తింగ్ ఉండడం వల్ల విద్యుత్ షాక్ తీవ్రత తగ్గడంతో పాటు ఇంట్లోని విద్యుత్ ఉపకరణాలు సైతం మరమ్మతులకు గురికాకుండా ఉంటాయి.

షాక్‌కు గురైన వ్యక్తికి..
ప్రమాదాలు ఎవరికీ చెప్పిరావు. అది ఏ స్థాయి ప్రమాదమైనా.. ఆస్తి నష్టంతో పాటు ప్రాణనష్టం కూడా జరుగుతుటుంది. ఇంట్లోనే కాదు ఏ ప్రదేశంలోనైనా విద్యుత్ సరఫరా సరిగా లేక అస్తవ్యస్తంగా ఉన్నా.. వైరింగ్ బాగోలేకపోయినా.. ఎర్తింగ్ సరిగ్గా చేయకున్నా.. విద్యుత్ ఎక్కువైనా.. సరైన జాగ్రత్తలు పాటించకపోయినా.. విద్యుత్ షాక్ వస్తుంది. ఎక్కువ సామర్థ్యం ఉన్న హైటెన్షన్ విద్యుత్ అయితే క్షణాల్లోనే ప్రాణాలు పోతాయి. ఎల్‌టీ లైన్లలో విద్యుత్ షాక్ ప్రమాదాలు జరిగితే మాత్రం.. అపాయంలో ఉన్నవారిని కొన్ని ప్రత్యేక పద్ధతుల ద్వారా మనం రక్షించుకోవచ్చు.

208

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles