మ్యాన్‌హోళ్ల మరమ్మతులను 31 లోగా పూర్తి చేయాలి

Sun,May 26, 2019 12:23 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : జీహెచ్‌ఎంసీ, జలమండలి నిర్మించిన మ్యాన్‌హోళ్ల మరమ్మతులను ఈ నెల 31తేదీలోగా పూర్తిచేయాలని జలమండలి ఎండీ, జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిశోర్ అధికారులను ఆదేశించారు. శనివారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన నగర సమన్వయ సమావేశంలో పలు శాఖల అధికారులనుద్ధేశించి ఆయన మాట్లాడారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 2 వేల కిలోమీటర్ల రోడ్డుపై ఉన్న 8174 సివరేజీ మ్యాన్‌హోళ్లు, 1903 వాల్యూచాంబర్ల ఎత్తును రోడ్డుకు సమాంతరంగా పెంచేందుకు రూ. 12.56 కోట్లను కేటాయించామని, వర్షాకాలం దగ్గర పడుతుండటంతో మ్యాన్‌హోళ్ల మరమ్మతులను సకాలంలో పూర్తిచేసి, ఇబ్బందులు లేకండా చూడాలని, అలాగే జూన్ 5తేదీ లోపు రోడ్ల విస్తరణ పనులను ముగించాలని అధికారులను ఆదేశించారు. వీటితో పాటు ఇప్పటి వరకు ధ్వంసమైన, పాడైన మ్యాన్‌హోళ్లను గుర్తించి, మరమ్మతులు చేయాలని ఆదేశించారు. నగర పౌరులకు మ్యాన్‌హోళ్లల్లో చెత్తాచెదారం వేయకుండా అవగాహన కల్పించాలన్నారు. హైదరాబాద్ జిల్లా సంయుక్త కలెక్టర్ గుగులోతు రవి, సైబరాబాద్, రాచకొండ, ట్రాఫిక్ ఉన్నతాధికారులు, జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషన్ హరిచందన, జలమండలి డైరెక్టర్లు, అధికారులతో పాటు పలు శాఖల అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

216

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles