అంబరాన్నంటేలా రాష్ర్టావతరణ సంబురాలు

Sun,May 26, 2019 12:25 AM

-ఘనంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్
మేడ్చల్ జిల్లా, నమస్తే తెలంగాణ ప్రతినిధి : జూన్ 2వ తేదీన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను అంబరాన్నంటేలా నిర్వహించాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ డా.ఎంవీ రెడ్డి అన్నారు. ఘనంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని మీటింగ్ హాల్‌లో వివిధ శాఖల జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించిన ఆయన కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాట్లు షురూ చేయాలన్నారు. గతంలో మాదిరిగానే వేడుకల నిర్వహణకు కమిటీలను ఏర్పాటు చేస్తామని, భారీ కేడింగ్, అడ్రస్ సిస్టం, శామీయానాలు, స్టేజీ ఏర్పాటు చేయాలని ఆర్‌అండ్‌బీ అధికారులకు సూచించారు.

తాగునీటి వసతి ఏర్పాట్లను గ్రామీణ తాగునీటి సరఫరాశాఖ అధికారులు, ప్రాథమిక చికిత్స కేంద్రం, 108 ఏర్పాటు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని, వేడుకలను వచ్చే ప్రజలకు వసతులు కల్పించాలని, పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులకు కలెక్టర్ సూచించారు. వివిధ శాఖల ప్రగతిని తెలిపే స్టాల్స్‌ను ఏర్పాటు చేయాలని, మంత్రి మల్లారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరవుతారన్నారు. కీసరలోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించి జాతీయ పతాకావిష్కరణ, తెలంగాణ అమరుల కుటుంబాలకు సన్మానం వంటి కార్యక్రమాలుంటాయని తెలిపారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన ప్రముఖులకు అవార్డులు, ప్ర శంసాపత్రాలు అందించడం జరుగుతుందన్నారు. డీఆర్వో మధుకర్‌రెడ్డి, డీపీవో రవికుమార్, డీఎఫ్‌వో సుధాకర్‌రెడ్డి, డీఆర్‌డీవో కౌటిల్య, జీఎండీఐసీ రవీందర్, డీఈవో విజయకుమారి, ఆర్డీవోలు లచ్చిరెడ్డి, మధుసూదన్ పాల్గొన్నారు.

246

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles