దేశం గర్వించేలా అభివృద్ధి

Mon,May 27, 2019 02:58 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేశం గర్వించేలా ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. అభివృద్ధే లక్ష్యంగా నేతలు, కార్యకర్తలు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని నాంపల్లి, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గ స్థాయి సమావేశాల్లో మంత్రి తలసాని పాల్గొని ప్రసంగించారు. అంతకు ముందు వెస్ట్ మారేడ్‌పల్లిలోని తన నివాసం వద్ద సనత్‌నగర్ నియోజకవర్గ కార్పొరేటర్లు, పార్టీ ముఖ్య నేతల తలసాని శ్రీనివాస్‌యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని, అధైర్యపడకుండా ప్రజా తీర్పును గౌరవించాలన్నారు. యువత రాజకీయాల్లోకి రావాలనే లక్ష్యంతోనే అతి చిన్న వయసు కలిగిన సాయి కిరణ్ యాదవ్‌కు ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పించారని పేర్కొన్నారు. మొదటి సారి పోటీ చేసిన గట్టి పోటీ ఇచ్చారన్నారు. తానెప్పుడూ ప్రజలతోనే ఉంటానని, ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తలసాని సాయి కిరణ్ యాదవ్ పేర్కొన్నారు. తనకు ఓటేసి మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా సాయి కిరణ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మాగంటి గోపీనాథ్, ఎమ్మెల్సీలు ప్రభాకర్, బోడకుంటి వెంకటేశ్వర్లు, ఇన్‌చార్జిలు ఆనంద్ గౌడ్, బండి రమేశ్, తాడూరి శ్రీనివాస్, కార్పొరేటర్లు, టీఆర్‌ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

164

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles