తెలంగాణ సారస్వత పరిషత్తు మహోన్నత సంస్థ

Mon,May 27, 2019 02:58 AM

తెలుగుయూనివర్సిటీ: సారస్వత పరిషత్తు మహోన్నత సంస్థ అని సంగీత నాటక అకాడమీ అధ్యక్షుడు డి. శివకుమార్ అన్నారు. తెలంగాణ సారస్వత పరిషత్తు స్థాపన దినోత్సవాలు ఆదివారం సాయంత్రం పరిషత్తు అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షతన జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన సంగీత నాటక అకాడమీ అధ్యక్షుడు బి. శివకుమార్ మాట్లాడుతూ పరిషత్తుకు సంగీత నాటక అకాడమీ తోడ్పాటు ఉంటుందని హామీ ఇచ్చారు. భాషా, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ మాట్లాడుతూ తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనానికి పరిషత్తు పాత్ర ప్రశంసనీయమన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ సాహితీవేత్తలు డాక్టర్ కాసర్ల నరేశ్‌రావు, డాక్టర్ ఉదారి నారాయణ, గంట్యాల ప్రసాద్, వి. బాగన్నగౌడ్, డాక్టర్ అవుసుల భానుప్రకాశ్, డాక్టర్ బెల్లి యాదయ్య, డాక్టర్ చేకూరి రమేశ్, పూసల లింగాగౌడ్, కోట్ల వెంకటేశ్వరరెడ్డి, వేణు సంకోజు, డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్, డాక్టర్ రాయారావు సూర్యప్రకాశ్‌రావు, దాస్యం సేనాధిపతిలను ఘనంగా సత్కరించారు. పరిషత్తు ప్రచురించిన పలు ప్రచురణలను సోమవారం సాయంత్రం జరిగే సభలో అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవుపల్లి ప్రభాకరరావు, పద్మభూషణ్ డాక్టర్ కె. ఐ వరప్రసాదరెడ్డి పాల్గొని ఆవిష్కరిస్తారని పరిషత్తు ప్రధాన కార్యదర్శి చెన్నయ్య తెలిపారు.

191

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles