ఘనంగా మల్లన్నస్వామి కల్యాణోత్సవాలు

Mon,May 27, 2019 02:58 AM

మణికొండ(నమస్తే తెలంగాణ): మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని ల్యాంకోహిల్స్ వద్ద ఉన్న మల్లన్న స్వామి దేవాలయంలో మూడురోజుల పాటు జరిగే మల్లన్న కల్యాణో త్సవాలు ఆదివారం అంగరంగవైభవోపేతంగా ప్రారంభమైయ్యాయి. మొదటి రోజు స్వామివారికి కొట్నం, మల్లన్న లగ్నం, అగ్నిగుండాలు తొక్కుట, సదర్‌పటం, మల్లన్న భోనాలు, మల్లన్న చరిత్రపై ఒగ్గుకథ కార్యక్రమాలను నిర్వహించారు. మొదటిరోజు ఉత్సవాల ప్రారంభోత్సవానికి హంపీ పీఠాధిపతి విద్యారణ్య భారతీస్వామిజీ హాజరై పూజా కార్యక్రమాలను చేపట్టి భక్తులకు ఆశీర్వచనాలు అందించారు. ఒగ్గు కళాకారులు ఒగ్గు వీరే శం బృందం, ఆలయ పూజారి మండువ మధుసూధన్‌శర్మల మంత్రోచ్చరణలతో పూజా కార్యక్రమాలను కొనసాగించారు. దొడ్డి సత్తయ్య జ్ఞాపకార్ధం దొడ్డి వరలక్ష్మీ, దొడ్డి శ్రీకాంత్, రేవతి, ధనుశ్రీ, హరికలు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నేడు ఎల్లమ్మ అమ్మవారి పూజా కార్యక్రమాలతో ప్రారంభమై మల్లన్నస్వామి ఓడిబియ్య భోజ నాలు, గంగకు పోవుట కార్యక్రమాలను నిర్వహిస్తామని ఆలయకమిటీ అధ్యక్షులు శ్రీ రాములు తెలిపారు. ఈనెల 28న కొట్నం, ఎల్లమ్మలగ్నం, ఎల్లమ్మభోనాలు అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. ఆలయ కమిటీ చైర్మన్ బుద్దోలు జైహింద్‌రావు, మాజీ సర్పంచ్ కె.నరేందర్‌రెడ్డి, ఉపసర్పంచ్ ఎల్.నాగేష్, కురుమసంఘం అధ్యక్షుడు బుద్దోలు శ్రీరాములు, కురుమసంఘ ప్రతినిధులు దొడ్డి బాబురావు, లక్ష్మణ్, బీరప్ప, సిద్ధప్ప పాల్గొన్నారు.

212

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles