ఏఎంఎస్ కళాశాల డిగ్రీ ఫలితాలు విడుదల

Wed,June 12, 2019 03:23 AM

ఉస్మానియా యూనివర్సిటీ, జూన్ 11: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఆంధ్ర మహిళా సభ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలోని డిగ్రీ రెండు, నాలుగు, ఆరో సెమిస్టర్ పరీక్షా ఫలితాలను మంగళవారం విడుదల చేశారు. కళాశాలలోని బోర్డ్ రూమ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఈ ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ ఈ ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థినులను అభినందించారు. కార్యక్రమంలో ఓయూ ఎగ్జామినేషన్ బ్రాంచి అడిషనల్ కంట్రోలర్లు డాక్టర్ ఇంద్రకంటి శేఖర్, డాక్టర్ ఎం. వెంకట్‌నారాయణ, డాక్టర్ బి. అశోక్, కళాశాల సెక్రెటరీ, కరస్పాండెంట్ ప్రొఫెసర్ ఎం. శ్రీనివాస్, ప్రిన్సిపాల్ డాక్టర్ డి. రాజేశ్వరి, వైస్ ప్రిన్సిపాల్ పి. రాజ్యలక్ష్మి, కళాశాల కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, అడిషనల్ కంట్రోలర్లు తదితరులు పాల్గొన్నారు.

172

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles