మధ్యంతర భృతిని మంజూరు చేయాలి

Wed,June 12, 2019 03:23 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : మధ్యంతర భృతిని మంజూరు చేయాలని, పెండింగ్‌లో ఉన్న డీఏను విడుదల చేయాలని, పీఆర్సీ నివేదికను అమలు చేయాలని టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వై.అశోక్‌కుమార్ అన్నారు. ఈ మేరకు మంగళవారం టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆశోక్‌కుమార్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయ పోస్టులను విద్యా వలంటీర్, కాంట్రాక్ట్ వ్యవస్థతో కాకుండా రెగ్యులర్ టీఆర్‌టీ అభ్యర్థులకు నియామక పత్రాలివ్వాలని తెలిపారు. హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎం.రవీందర్ మాట్లాడుతూ.. ఆరేండ్లుగా సీపీఎస్‌ను రద్దు చేయాలని పోరాడుతున్నామని తెలిపారు. అనంతరం డీఆర్‌ఓను కలిసి సమస్యలు పరిష్కారమయ్యేలా చూడాలని వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు గౌతమినాయుడు, ప్రధాన కార్యదర్శి బి.రాంబాబు, కార్యదర్శులు పి.వెంకటేశ్వరప్రసాద్, కె.సీతారామశాస్త్రి, భాస్కర్, సురేశ్, రవికుమార్, అరుణభారతి, టీఆర్‌టీ అభ్యర్థులు పాల్గొన్నారు.

309

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles