దవాఖానల్లో తనిఖీ

Wed,June 12, 2019 03:26 AM

తెలుగుయూనివర్సిటీ/బేగంబజార్/మెహిదీపట్నం/బన్సీలాల్‌పేట్ :నగరంలోని గాంధీ, ఉస్మానియా, సరోజినీదేవి, నిలోఫర్ దవాఖానలను మంగళవారం వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తనిఖీ చేశారు. వైద్య శాలలోని పలు విభాగాలను పరిశీలించారు. అనంతరం వైద్యులతో సమావేశమై దవాఖానల అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు.

తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలకు ఉచితంగా, కార్పొరేట్‌కు దీటుగా మెరుగైన వైద్యాన్ని అందించాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ అనేక నూతన విధానాలను తీసుకువస్తున్నారని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మంగళవారం ఆయన నిలోఫర్, ఉస్మానియా, గాంధీ, సరోజినీ దవాఖానలను సందర్శించారు.

నీలోఫర్‌లో : నీలోఫర్ దవఖానలో చిన్నారులకు, బాలింతలకు అందుతున్న వైద్య సేవలు, దవఖానలో నెలకొన్న సమస్యల గురించి డీఎంఈ డాక్టర్ రమేశ్ రెడ్డితో కలిసి పరిశీలించారు. రోగులకు వడ్డిస్తున్న భోజనాన్ని తనిఖీ చేశారు. అనంతరం దవఖానలో డీఎంఈ డాక్టర్ రమేశ్‌రెడ్డి, సూపరిండెంట్ డాక్టర్ మురళీకృష్ణ, ప్రభుత్వ వైద్యుల సంఘం ప్రతినిధులు డాక్టర్ లలూప్రసాద్, నరహరి, వినోద్, రవికుమార్, టీఎస్‌ఎన్‌ఎస్‌ఐడీసీ చీఫ్ ఇంజినీర్ లకా్ష్మరెడ్డి, సిబ్బందితో సమావేశం నిర్వహించారు.ఎంఎన్‌జే క్యాన్సర్, నీలోఫర్ దవఖానలకు సంయుక్తంగా పీజీ హాస్టల్ నిర్మించాలని ప్రభుత్వ వైద్యుల సంఘం ప్రతినిధులు మంత్రిని కోరారు.

సరోజినిలో: సరోజిని దేవి కంటి దవాఖానలో సుమారు రూ. కోటి నిధులతో నిర్మించిన పీజీ విద్యార్థుల హాస్టల్‌ను ప్రారంభించారు. రెండు అంతస్తుల్లో 24 గదులు ఉన్న ఈ భవనంలో 48 మంది విద్యార్థులు నివసించవచ్చు. అదేవిధంగా సీతఫల్‌మండి లయన్స్ క్లబ్ వారు ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్‌కు విరాళంగా ఇచ్చిన యంత్రాలను కూడా మంత్రి ఈ సందర్భంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీఎంఈ రమేశ్‌రెడ్డి, సూరింటెండెంట్ రాజలింగం, ఆర్‌ఎంవో నజాఫీబేగం, చీఫ్ ఇంజినీర్ లకా్ష్మరెడ్డి, డాక్టర్లు మోదిని, శ్రీనివాస్‌ప్రసాద్, సరస్వతి, తదితరులు పాల్గొన్నారు.

ఉస్మానియాలో :ఉస్మానియాను డీఎంఈ రమేశ్‌రెడ్డి, సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్‌తో కలిసి సందర్శించారు. అనంతరం సిబ్బందితో సమావేశమయ్యారు.దవాఖానలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇదిలా ఉండగా దవాఖానలో ఉన్న ఖాళీ స్థలంలో నాలుగు బ్లాక్‌లుగా విభజించి నూతన భవనాలను నిర్మించేలా ప్రణాళికలు రూపొందించాలని చీఫ్ ఇంజినీర్ లకా్ష్మరెడ్డికి సూచించారు. ఈ కార్యక్రమంలోడాక్టర్లు రాందాస్, పాండు నాయక్, రమేశ్,ఆర్‌ఎంవోలు సాయి శోభ,నరేందర్,రఫీ, రాజ్‌కుమార్,సుష్మ, మాధురి,డాక్టర్ నాగప్రసాద్,సిధ్ధిఖీ,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

గాంధీలో: గాంధీ దవాఖానను డీఎంఈ డాక్టర్ రమేశ్ రెడ్డి, సూపరింటెండెంట్ డాక్టర్ పి.శ్రావణ్ కుమార్, ఆర్‌ఎంవోలు జయకృష్ణ, శేషాద్రి, సాల్మన్‌రాజు, ఇతర పరిపాలనా విభాగం అధికారులతో కలసి ఆయన డయాగ్నస్టిక్ ల్యాబోరేటరీ, డయలసిస్ యూనిట్, ఐసీయూ, ఈఎన్‌టీ, న్యూరో, నూతన అత్యవసర విభాగాలను పరిశీలించారు. నూతన డ్రైనేజీ వ్యవస్థ కోసం ప్రణాళిక రూపొందిస్తామని, ఫైర్ సేఫ్టీ కోసం ప్రత్యేక చర్యలు చేపడతా మన్నారు.

293

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles