ఎర్రమందార మకరందం ఆవిష్కరణ

Sun,August 25, 2019 03:29 AM

రవీంద్రభారతి : కె.ప్రభాకర్ సాహితీ స్వర్ణోత్సవ సందర్భంగా ఆయన రచించిన ఎర్రమందార మకరందం కావ్యగ్రంథాన్ని తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు డా.నందిని సిదారెడ్డి ఆవిష్కరించారు. రవీంద్రభారతిలోని సమావేశ మందిరంలో లావణ్య ఆర్ట్ క్రియేషన్స్ సంస్థ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన పుస్తకావిష్కరణ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలుగు అకాడమీ పూర్వ అధ్యక్షుడు డా.వెల్చాల కొండలరావు అధ్యక్షతన జరిగిన సభలో తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డా.ఏనుగు నరసింహారెడ్డి, కవి, తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడు డా.నాళేశ్వరం శంకరం, చీకోలు సుందరయ్య, కందుకూరి శ్రీరాములు పాల్గొని అభినందనలు తెలియజేశారు.

59

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles