చరిత్రలో నిలిచిపోయే ప్రాజెక్టు కాళేశ్వరం

Mon,August 26, 2019 02:53 AM

ఖైరతాబాద్ : రాష్ర్టాన్ని సస్యశ్యామలంగా చేయాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చరిత్రలోనే ఓ అద్భుమైన ప్రాజెక్టు అని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బోర్లకుంట వెంకటేశ్ నేత అన్నారు. సీపీఎస్ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు డాక్టర్ బోర్లకుంట వెంకటేశ్ నేత పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైన సందర్భంగా సీపీఎస్ టీచర్స్, ఎంప్లాయీస్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్రం ఆధ్వర్యంలో అభినందన, కృతజ్ఞత సభ ఆదివారం ఖైరతాబాద్‌లోని మింట్ కాంపౌండ్‌లో జరిగింది.

ఈ సందర్భంగా డాక్టర్ వెంకటేష్ మాట్లాడుతూ చారిత్రక నిర్మాణంగా నిలిచిపోయే కాళేశ్వరాన్ని సందర్శించేందుకు దేశ, విదేశాల నుంచి ప్రముఖులు, రాజకీయ నాయకులు, కేంద్ర మంత్రులు వస్తున్నారని, ఈ కట్టడాన్ని చూసి ప్రశంసిస్తున్నారన్నారు.

గ్రూప్-1 అధికారుల సంఘం, వివిధ ఉద్యోగుల సంఘం ప్రతినిధిగా తాను సీపీఎస్ విషయంలో అనేక చర్చల్లో పాల్గొన్నానని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి, దానిని విశ్లేషించి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. అనంతరం ఆ సంఘం నాయకులు ఎంపీ డాక్టర్ వెంకటేశ్ నేతను శాలువా, పూలమాలతో సత్కరించారు. ఈ సభలో సీపీఎస్ టీచర్స్, ఎంప్లాయీస్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు దాముక కమలాకర్, ప్రధాన కార్యదర్శి చీటిభూపతిరావు, హైకోర్టు న్యాయవాది రత్నం రాజేశ్ నేత, సహాయ అధ్యక్షులు పి.రవి, శంకర్, రఘునందన్, అంజయ్య, రామంచ రవీందర్, దుర్గాప్రసాద్, మధుబాబు, హరికృష్ణారెడ్డి, గోపాల్‌రెడ్డి, పుల్లారావు, చంద్రశేఖర్ రెడ్డి, రవీందర్ గౌడ్, ప్రభాకర్ పాల్గొన్నారు.

77

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles