తెలుగు వైద్యులు ఆనంద్‌కు జాతీయ స్థాయి అవార్డు

Mon,August 26, 2019 02:54 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : తెలంగాణ వాసి, మిర్యాలగూడ వాస్తవ్యులైన తెలుగు వైద్యుడు, సినీ దర్శకులైన డాక్టర్ ఆనంద్‌కు సేవా రంగంలో జాతీయ స్థాయి అవార్డు లభించింది. ఈ సందర్భంగా ఆయన తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. నార్త్ ఢిల్లీ కల్చరల్ అకాడమీ, ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్సు వాళ్లు సంయుక్తంగా శనివారం దేశ రాజధాని న్యూఢిల్లీలో కల్చరల్ మీట్ నిర్వహించారని, దేశ వ్యాప్తంగా వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన వారికి జాతీయ స్థాయి అవార్డులను అందజేసి సత్కరించిందని తెలిపారు. ఢిల్లీలోని ఆంధ్ర, తెలంగాణ భవన్‌లోని ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో డాక్టర్ ఆనంద్‌కు తెలంగాణ భవన్ కమిషనర్ వేణు గోపాలచారి, జస్టిస్ పీఎస్ నారాయణ, వాటర్ ట్రిబ్యునల్ మెంబర్ డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ బింగి నరేందర్ గౌడ్, ఇతర ప్రముఖుల చేతుల మీదుగా ఈ అవార్డుల ప్రదానం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆనంద్ తమకు సహకరించిన జనయిత్రి ఫౌండేషన్ పుష్యమి దువ్వూరి, మిత్రులు చైతన్య, దీప్తి, స్వామి నాయక్, డాక్టర్ రంజిత్, షర్మిలారెడ్డి, రాధికా రెడ్డి, హన్మంత్ నాయక్‌లకు ధన్యవాదాలు తెలిపారు.

75

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles