మానవ తప్పిదాల వల్లే రోడ్డు ప్రమాదాలు

Mon,August 26, 2019 02:56 AM

ఖైరతాబాద్ : మానవ తప్పిదాల వల్లే నిత్యం రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ ఇండియా తెలంగాణ స్టేట్ సెంటర్ చైర్మన్ డాక్టర్ జి.రామేశ్వర్‌రావు తెలిపారు. ఆదివారం ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో ప్రతి ఏడాదికి 15వేల మంది, రోజుకు 40 మంది రోడ్డు ప్రమాదంలో మరణిస్తున్నారన్నారు. అందులో ఎక్కువ శాతం మానవ తప్పిదాలే కారణమవుతున్నాయన్నారు. ఈ సదస్సులో రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చట్టాలు తదితర అంశాలపై నిపుణులు తమ సలహాలు, సూచనలు అందజేస్తారన్నారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర రవాణా, రోడ్లు, భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, రోడ్లు, భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్ శర్మ, విద్యా శాఖ కార్యదర్శి డాక్టర్ బి.జనార్దన్‌రెడ్డి, రాష్ట్ర రోడ్డు సేఫ్టీ అథారిటీ చైర్మన్ టి.కృష్ణప్రసాద్ తదితరులు హాజరవుతున్నారని తెలిపారు. ఐఈఐ కార్యదర్శి టి.అంజయ్య, సహాయ కార్యదర్శి ప్రొఫెసర్ రమణా, తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్ల సంఘం ఉపాధ్యక్షులు ఎస్.ముత్యంరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.

91

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles