పీవీ సింధుకు మేయర్ అభినందన

Mon,August 26, 2019 02:57 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ప్రపంచ బ్యాడ్మింటన్ విజేతగా నిలిచిన పీవీ సింధుకు మేయర్ బొంతు రామ్మోహన్ అభినందనలు తెలిపారు. దేశ చరిత్రలో ప్రపంచ బ్యాడ్మింటన్ విజేతగా నిలిచిన మొదటి మహిళగా హైదరాబాదీ నిలువడం గర్వకారణమన్నారు.రేపు మఖ్దూం మొహియుద్దీన్ అవార్డు ప్రదానోత్సవ సభ
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : షాయరే తెలంగాణ, సిటీ కళాశాల పూర్వ అధ్యాపకులు, మహాకవి మఖ్దూం మొహియుద్దీన్ పేరిట నెలకొల్పిన సిటీ కాలేజీ మఖ్దూమ్ మొహియుద్దీన్ జాతీయ అవార్డును ప్రముఖ సాహితీవేత్త తెలుగు విశ్వ వి ద్యాలయం పూర్వ ఉపకులపతి ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణకు ప్రకటించారు. ఈ అవార్డు ప్రదానోత్సవ సభ ఈ నెల 27న ఉదయం 11 గంటలకు నగరంలోని సిటీ కళాశాల ఆవరణలోని గ్రేట్ హాల్‌లో జరుగనున్నది. సిటీ కళాశాల ప్రధానాచార్యులు డాక్టర్ సి.మంజులత అధ్యక్షతన జరిగే సభలో గౌరవ అతిథులుగా తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి, పాశం యాదగిరి, వాహెద్ హాజరుకానున్నారు.

254

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles