జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ ఎన్నిక

Thu,September 12, 2019 05:00 AM

రంగారెడ్డి జిల్లా, నమస్తే తెలంగాణ: రంగారెడ్డి జిల్లా ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ హిమాయత్‌నగర్‌లో ఖాళీగా ఉన్న 15 మేనేజింగ్ కమిటీ పోస్టుల ఎన్నికలకు 15మంది మేనేజింగ్ కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నా మని ఆ సంస్థ ఎన్నికల అధికారి అనిత తెలిపారు. ఇందులోభాగంగా కమిటీ చైర్మన్‌గా ఎస్.నర్సింహారెడ్డి, జిల్లా కార్యదర్శిగా రాజేందర్‌రెడ్డిని నియమించామని చెప్పారు. ఉపాధ్యక్షులుగా అరుణ్, పాండు, కోశాధికారిగా రాఘవరెడ్డి, సభ్యులుగా అంజయ్య, అంజిరెడ్డి, గిరిధర్‌గౌడ్, ఆంజనేయులు, దామోదర్‌రెడ్డి, సురేష్‌కుమార్, కిష్ణారెడ్డి, రమేష్, వెంకన్నబాబు, సర్దార్, సుబ్బలక్ష్మి తదితరులను ఎన్నుకున్నట్లు వెల్లడించారు. అనంతరం జిల్లా ఇన్‌చార్జ్జి కలెక్టర్ హరీష్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

160

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles