ప్రత్యేక ప్రణాళికను పక్కాగా అమలుచేయాలి

Thu,September 12, 2019 05:01 AM

కందుకూరు: పల్లెల ప్రగతి, అభివృద్ధి కోసం అమలు చేసే 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను విజయవం తం చేసే బాధ్యత ప్రజలపై ఉందని పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్ అన్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలపరిధిలోని రాచులూరు, సరస్వతిగూడ గ్రామాల్లో కార్యాచరణ ప్రణాళిక ఏ విధం గా అమలు చేస్తున్నారనే విషయాన్ని పరిశీలించడానికి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన అధికారులను ప్రజాప్రనిధులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. యాక్షన్ ప్లాన్ తయారు చేశారా. చేసినట్లయితే యాక్షన్ ప్లాన్ ప్రకారం పనులను చేపట్టాలని సూచించారు. గ్రామ పంచాయతీలకు ఆదాయవనరులను సమకూర్చుకోవాలని సూచించారు. గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులతో మొదట క్లీన్ అండ్ గ్రీన్ పనులకు ప్రాధాన్యతనివ్వాలని తెలిపారు. పరిశుభ్రమైన వాతావరణంలో గ్రామాలు ఉండాలని, ఇతర రాష్ర్టాలు వచ్చి నేర్చుకునేలా గ్రామాలు తయారుకావాలని కోరారు.

ప్రజలు అధికారులు, ప్రజాప్రతినిధులు నిబద్ధతతో పనిచేసి గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. పచ్చదనం, పరిశుభ్రత, నిధుల వినినియోగం,ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి పనులు నిరంతరం సాగాలని సూచించారు. పం చాయతీల్లో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులను గ్రామాలకు అవసరమయ్యే విధంగా నియమించుకోవాలని, ఎక్కువమందిని నియమించినట్లయితే ఇబ్బందులు వస్తాయని పేర్కొన్నారు. కార్యాచరణ ప్రణాళికలో నిర్లక్ష్యం చేయవద్దని కోరారు. ప్రభుత్వం ప్రతిఏడాది అందించే నిధుల తో పనులను పూర్తి చేయాలని కోరారు. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా పం చాయతీ అధికారి పద్మజారాణి, విద్యాధికారి సత్యనారాయణరెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ కప్పాటి పాండురంగారెడ్డి, జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, ఎంపీపీ మంద జ్యోతి పాండు, ఎంపీడీఓ కృష్ణకుమారి, తహసీల్దార్ యశ్వంత్, ఈఓపీఆర్డీ విజయలక్ష్మి, సర్పంచ్‌లు శ్రీనివాసాచారి, రాము, నోడల్ అధికారి రాజు, అగర్‌మియగూడ సర్పం చ్ భూపాల్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు సురుసాని సురేందర్‌రెడ్డి, గంగాపురం లక్ష్మీనర్సింహరెడ్డి, ఆయా గ్రామాల కోఆప్షన్, వార్డు, స్లాండింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

157

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles