వ్యాధి రాకముందే జాగ్రత్తలు తీసుకోవాలి

Thu,September 12, 2019 05:02 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: దేశంలో క్యాన్సర్ వ్యాధి బాధితుల సంఖ్య పెరుగుతుందని, ముఖ్యం గా మహిళలు ప్రతీ ఏడాది లక్షమంది వరకు రొమ్ముక్యాన్సర్‌తో మరణిస్తున్నట్లు నగర మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. బుధవారం మేయర్ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు జరిపే వెరబుల్ డివైజ్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ 15ఏండ్ల క్రితం క్యాన్సర్ పెద్దగా లేద ని, గత నాలుగేండ్లుగానే ఈ వ్యాధి తీవ్రత పెరుగు తుందన్నారు. వ్యాధి రాకముందే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా నిరుపేద మహిళలు ముందస్తు క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం ఉత్తమమన్నారు. మామోగ్రఫీ పరీక్షల ద్వారా క్యాన్సర్‌ను గుర్తించి జాగ్రత్తపడవచ్చన్నారు. జపాన్‌కు చెందిన ఒక వైద్య సంస్థ క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు జరిపేందుకు ముందు కు వచ్చిందని, వారి సహకారంతో జీహెచ్‌ఎంసీలో పనిచేస్తున్న 18వేల మంది పారిశుధ్య కార్మికులకు ఇక్కడ ఉచితంగా క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయిస్తామన్నారు. సర్కిల్ వారీగా సిబ్బందికి ఈ పరీక్షలు నిర్వ హిస్తామన్నారు. డిప్యూటీ మేయర్ బాబాఫసియుద్దీన్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేశ్‌కుమార్, శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ హరిచందన, రాగాశ్‌థాచాట్ పాల్గొన్నారు.

227

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles