పోలీస్ కానిస్టేబుళ్ల ఫలితాలు విడుదల చేయాలి


Sat,September 21, 2019 02:03 AM


హిమాయత్‌నగర్ : రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుళ్ల ఉద్యోగాల ఫలితాలను విడుదల చేయాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అనిల్‌కుమార్ ప్రభుత్వాన్ని కోరారు. శుక్ర వారం హిమాయత్‌నగర్‌లోని మక్దుమ్ భవన్‌లో కానిస్టేబుళ్ల అభ్యర్థులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ 2018లో విడుదల చేసిన నోటిఫికేషన్‌లో ఎంపికైన అభ్యర్థుల తుది ఫలితాలు విడుదల చేయకపోవడంతో అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఫలితాలను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్.శ్రీకాంత్, నాయకుడు ఆర్.బాలకృష్ణ, అభ్యర్థులు దుర్గంరాజు, రాజేందర్‌రెడ్డి, అనిల్, ప్రవీణ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

212

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles